
VARDHAKYAM VARAMA ? SAPAMA
by DR.GURAJADA SHOBA PERINDEVI
₹100
In stock · 1 available
PublisherVALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
LanguageTelugu
వార్థక్యం వరమా? శాపమా? పెద్దలపై పరిశోధనాత్మక వ్యాసాలు సేవారంగానికి ప్రథమస్థానాన్ని, సాహిత్యానికి ద్వితీయ స్థానాన్ని ఇచ్చిన శోభా పేరిందేవి విద్యార్థిని దశనుండే విభిన్న పత్రికల్లో రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి, రెండు వందలకి పైగా కథలు, వ్యాసాలు, వందలాది ప్రశంసాపత్రాలు రాశారు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా, కాలమిస్ట్గా పనిచేశారు. 'తెలుగు తరంగిణి', 'గాంధీనగర్ టైమ్స్' పత్రికలలో ఎడిటర్గా చేశారు. అటు పార్ట్ టైమ్ లెక్చరర్గా ఇటు యాక్టివిటీ టీచర్గా చేశారు. వృద్ధులపై పరిశోధన చెయ్యడమే కాక వృద్ధాశ్రమాలకి, సంస్థలకి సేవలందిస్తూ వృద్ధులను సెకండ్ వెంచర్కై జాగృతం చేస్తుంటారు. నాటికలు రాసి దర్శకత్వం వహించి బాలలను, యువతని, వృద్ధులను సేవా కార్యక్రమాల వైపుకు మళ్లిస్తుంటారు. సిటీ సెంటర్ లైబ్రరీ ఉద్యోగినులు, చంచల్గూడా జైలు ఖైదీలు, సత్యసాయి బాలల/మహిళా విభాగ సభ్యులు, ఆంధ్ర బాలానంద బాలలు, అభినందన సభ్యురాళ్లు, అప్నాఘర్ వీధిబాలలు ఆమె నాటకాల్లో నటించారు. వివిధ పాఠశాలల పిల్లలు ఆమె పాటలను పాడారు. ఇటీవల కేరళలో జరిగిన 'ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ అవేర్నెస్ అసోసియేషన్ మీట్'లో డ్రామా కాంపిటీషన్లో శోభగారు రాసి, డైరెక్ట్ చేసిన 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' ఇంగ్లీష్ డ్రామాకి మొదటి బహుమతి వచ్చింది.