VARNAMALA by DR.G.V.RATNAKAR Telugu book cover

VARNAMALA

by DR.G.V.RATNAKAR

₹120
In stock · 9 available
PublisherJAI BHEEM PUBLICATIONS
LanguageTelugu
నా మాట ఓ తూరుపు దిక్కా! నీకు నేనేమని చెప్పాలి? చీకటి భయానికి పొద్దుపొడవడం లేదు నేను నిత్యం చీకటితో పోరాడుతూనే ఉంటాను నేనే కొత్త సూరీన్ని అని నీకెలా చెప్పాలి? (దామోదర్ మోరే, మరాఠీ కవి) భారతీయ సాహిత్యంలో దళిత కవిత్వానికి చిరునామాలాగా మరాఠీ కవిత్వాన్ని సూచిస్తాము. అలాంటి దళిత కవిత్వానికి తగిన వారసత్వంతో తెలుగు దళిత సాహిత్యం ముందుకు వస్తున్న తరుణంలో నిశాని కవిత్వం సాక్షిగా చిక్కనౌతున్న పాట, పదునెక్కిన పాట కవితా సంకలనాలు తెలుగు దళిత సాహిత్యానికి ఒక దారిని చూపించాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత మేనిఫెస్టో పేరుతో వచ్చిన విప్లవ కవిత్వంలో తమ మూలాలు ఎక్కడ అని ప్రశ్నిస్తూ దళిత సాహిత్య వేదిక డా. బి.ఆర్. అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ASA) 'గుండెడప్పు' (1995) మోగిస్తూ దండోరా వేసింది. పట్టేటి రాజశేఖర్ (కన్వీనర్) నాగప్పగారి సుందర్రాజు (ప్రెసిడెంట్)లు సంపాదకులుగా ప్రతులకు జి.వి.రత్నాకర్ (జనరల్ సెక్రటరీ) చిరునామాగా వచ్చిన గుండెడప్పుతో కొత్తతరం దళిత కవులుగా కోయి కోటేశ్వరరావు, చల్లపల్లి స్వరూపరాణి, గుండెడప్పు కనకయ్య, చుక్కా నాగభూషణం, కాకాని సుధాకర్, ఇస్తారి శంకర్, సిద్ధార్థి సుభాష్, రెడ్డిపల్లి వెంకటేశం, నూకతోటి రవికుమార్, కొలికపూడి శ్రీనివాస్ లు తెలుగు దళిత సాహిత్యంలో అడుగుపెట్టారు. శివసాగర్ ఆవిష్కరించిన గుండెడప్పు కవితా సంకలనాన్ని సతీష్ చందర్, జి. లక్ష్మీనరసయ్య, మద్దూరి నగేష్బాబు, పైడి తెరేష్ బాబు, కలేకూరి ప్రసాద్, శిఖామణిలు ముందుకు తీసుకువెళ్లడంలో తమ వంతు పాత్రను పోషించారు. గుండెడప్పు కవిత్వం ప్రేరణతో వున్న మా తరానికి సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా పి. కేశవకుమార్, నాగప్పగారి సుందర్రాజులు కవిత్వం రాస్తూ స్ఫూర్తిని అందించేవారు.