
VARNAMALA (UTPALAMALA SATAKAMU)
₹40
In stock · 384 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126337
VARNAMALA (Utpalamala Sathakamu) By Illa Muralidhara Rao కులభావన నరనరానా జీర్ణించుకుపోయిన నేటి సమాజంలో కులవివక్షకు వ్యతిరేకంగా మాట్లాడటం కత్తి మీద సామే. కానీ నావి నాలుగే నాలుగు ప్రశ్నలు. సంఘంలో పాతుకుపోయిన సతీసహగమనం వంటి దురాచారాలనే రూపుమాపిన మన సంఘసంస్కర్తలు పట్టుబట్టి ప్రయత్నించి ఉంటే కులనిర్మూలన అసాధ్యమా? ఏ మతబోధన ప్రకారమైనా మనుషులందరూ ఒకే ఆదిదంపతులకు పుట్టిన వారు కదా? (అంటే బంధువులు) కానీ వారిలో కొందరు దేవునికి సమీపంగా కొందరు ఊరికి దూరంగా. ఒకే ఆదిమానవుల వారసులై (బంధువులై)న అందరికీ సాంఘిక, ఆర్థిక సమానత ఎప్పుడు? సినిమాహాల్లో, షాపింగ్ లో, హోటళ్లలో, లాడ్జీలలో, సభల్లో, సమావేశాల్లో కులం చూడరేం? ముడిసరుకు ఎవరిది? తయారీ ఎవరిది? ప్యాకింగు ఎవరు? డెలివరీ ఎవరు? వంట ఎవరు? వడ్డించేదెవరు? పక్కసీట్లో కూర్చున్నదెవరు? అంతెందుకు? అంగడిబొమ్మకు కులం చూడరే? ఐక్యతను దెబ్బతీసే ఈ కులవివక్ష అవసరమా? ప్రపంచీకరణ వేగంగా వ్యాపించి, ఎవరిదే కులమో తెలుసుకోలేని ఈరోజుల్లో ఇంకా కులము, మతమని గిరిగీసుకోవడం అర్థరహితం కాదా? నడివీధిలో, నడిరోడ్డులో, నడిబజారులో పాటించని కులం ఇంట్లో మాత్రం ఎందుకో? అందరినీ ఆదరించేదే ఆచారం. కొందరికి కీడు చేసేది దురాచారం. మనుషులను వేరుచేసే ఈ కులవివక్ష అమానుషమైన దురాచారం. తక్షణమే దీనిని ఆపడం వివేకం. మానవత్వపు కనీస బాధ్యత. ఇళ్ళ మురళీధరరావు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN: 978-93-48126-33-7