VASIREDDY SEETADEVI - URMILA by DR.VASIREDDY SEETHADEVI Telugu book cover

VASIREDDY SEETADEVI - URMILA

by DR.VASIREDDY SEETHADEVI

₹90
In stock · 40 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఊర్మిళ "ఠంగా రంగ్! రంగ్" గోదకు చేరబడి, కొడుకు భవిష్యత్తు గురించిన ఆలోచనల్లో కూరుకుపోయిన ఊర్మిళ, తుల్లిపడింది. తలెత్తి గోడ గడియారం కేసి చూసింది. పన్నెండు! అరే! పన్నెండయిందే! మరి ఇంకా వాడు రాలేదేం? గంటలో వస్తానని ఎనిమిది గంటలకే కాలేజీకి వెళ్ళాడు. ఇంతసేపు ఏం పని చేస్తున్నాడు? బుద్ధి లేకపోతే సరి! ఆ శుభవార్త తన చెవిన పడేసి వెళ్ళకూడదూ వేరే ఏదైనా పని ఉంటే? ఇక్కడ తను క్షణమొక యుగంగా ఎదురుచూస్తూ ఉంటుందని వాడికి తెలియదా? ఎందుకు తెలియదు? వాడికి తన గురించి బాగా తెలుసు. అయితే మరి! అది శుభవార్త కాదేమో! అందుకే వాడు.... ఊర్మిళ గుండె వేగంగా కొట్టుకుంది. వెన్నముకలోకి చలికుదుపు జరజరపాకింది. అవును! అంతే అయి ఉండాలి! అందుకే తనకు ముఖం చూపించలేక రాలేదు. నో!నో! అలా ఎన్నటికీ కాదు. వాడు పాస్ కాకపోవడం ఏమిటి? ఎప్పుడూ ఫస్టు ర్యాంకులు వచ్చే తన బిడ్డ, ఈ ఎంట్రన్స్ పాస్ కాకపోవడం అసంభవం. ఎంతో కష్టపడి చదివాడు. పరీక్షరాసి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇంటికి వచ్చాడు. ఆ ఆత్మవిశ్వాసంతోనే, ఎంతో నిబ్బరంగా ఫలితాలు తెలుసుకోవడానికి వెళ్ళాడు. గంటలో తిరిగొస్తానని, మరీమరీ, చెప్పి వెళ్లాడు.