
VASTU PRAPANCHAM
₹250
In stock · 1 available
PublisherVADLAMUDI APPARAO
LanguageTelugu
వడ్లమూడి వాస్తు మాట - వరహాల మూట శుక్రాచార్యులు మొదలుకొని పద్దెనిమిది మంది మహర్షులు తమ కఠోర తపోదీక్షతో తమ అపార దూరదృష్టితో అభివృద్ధి చేసిన అపురూప శాస్త్రం ఈ వాస్తు విజ్ఞానం. నా దృష్టిలో వాస్తు విజ్ఞానం మంచినేస్తం వంటిది. దీని వలన మేలేజరు గుతుంది తప్ప కీడన్నది లేనేలేదు. వాస్తు దోషాలకు ఏ మాత్రం భయపడి పోనవసరం లేదని నా అభిప్రాయం. అలా భయపెట్టడం అంటే వాస్తును అవహేళన చేయడమనేదే నాభావన. ఎన్నో వాస్తు గ్రంథాలు మార్కెట్లో ఉండగా, మీరెందుకు ఈ పుస్తకం రాస్తున్నారు ? అని చాలా మంది ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడం నా ధర్మం. దాదాపు ముప్పయ్యేళ్ల క్రితం నాటి నా స్వానుభవాన్ని మీ ముందుచుతున్నాను. కృష్ణాజిల్లా, గంపలగూడెం గ్రామంలోని మా స్వగృహానికి పడమర, దక్షిణం స్థలాలు అదనంగా వచ్చి కలిశాయి. అప్పటి నుంచి మా తిరోగమనం ప్రారంభమై మా కుటుంబం అష్టకష్టాల పాలయింది. ఆనాటి నా ఇల్లే నాకు వాస్తు శాస్త్రంపై జిజ్ఞాసను పెంచింది. అందుబాటులో ఉన్న అన్ని వాస్తు గ్రంధాలను చదివాను. అయినా కొన్ని సందేహాలు తీరలేదు. అప్పుడే వాస్తు సామ్రాట్ ముద్రగెడ రామారావుగారితో పరిచయ భాగ్యం కలిగింది. వారి సలహా ప్రకారం ఇంట్లో మార్పు చేర్పులు చేశాం. దాని తరవాత అద్భుత ఫలితాలు వచ్చాయి. అప్పటి నుంచి గురుతుల్యులైన రామారావుగారి సలహా మేరకు ప్రాక్టికల్ వాస్తులో నా పరిశోధన ప్రారంభించాను. అనేక ఇళ్ళను పరిశీలించడం, అక్కడ నివశిస్తున్నవారి స్థితిగతులను తెలుసుకోవడం, నోట్స్ రాసుకోవడం... ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి. సివిల్ ఇంజినీరుగా నాకున్న పరిజ్ఞానానికి నా వాస్తు విజ్ఞానం తోడైంది. ఆధునిక నిర్మాణాలు జరుగుతున్న నేటి యుగంలో వాస్తు సిద్ధాంతికి సివిల్ ఇంజినీరింగ్ పరిజ్ఞానం తప్పని సరిగా ఉండాలని నా అభిప్రాయం. ఒక నిర్మాణ వాస్తు రీత్యా తప్పు అని చెప్పేవ్యక్తికి దానిని ఇంజనీరింగ్ పద్ధతుల ప్రకారం ఎలా సరిచేయాలో ఎంత తక్కువ ఖర్చుతో ఆ పనిని ముగించవచ్చో ఆ మెళకువలు కూడా తెలిసి ఉండాలి. నేను ఈ పుస్తకం రాయడానికి ఇది మొదటి కారణం. వాస్తు దోషాలు గల ఇళ్లల్లో ఏ విధమైన మార్పులు చేసుకోవాలో వివిధ చిత్ర పటాలతో నేను ఈ పుస్తకంలో వివరించాను. సరైన వాస్తు విజ్ఞానం లేని వారి వద్దకు పరుగులు తీసి కష్ట నష్టాల పాలు కాకుండా ఎవరికి వారు స్వయంగా తమ ఇంటిని వాస్తు ప్రాకారం తీర్చిదిద్దుకొనేలా ఈ పుస్తకాన్ని రచించాను. స్వార్థం కోసం ఒక శాస్త్రాన్ని నేర్చుకోవడం వేరు. పరోపకారమే పరమావధిగా పెట్టుకోవడం వేరు. నా వరకు నేను నా వాస్తు విజ్ఞానం అందరికీ చెందాలనే ఉద్దేశంతో ఏ దాపరికము లేకుండా సర్వ విషయాలు ఈ పుస్తకంలో రాయడం జరిగింది.