
VATSALYA GODAVARI
₹100
In stock · 29 available
PublisherJ.V.PUBLICATIONS
LanguageTelugu
వాత్సల్య గోదావరి ఆత్మీయ స్పందనలు 'జీళ్ళ సూరిబాబు ' కథ చదివాను. ఇందులో మీరు వాడిన భాష పాత్రోచితంగా ఉంది. అసలు 'జీళ్ళ సూరిబాబు' నిజానికి ఉన్నాడో లేడో తెలియదు కానీ, కథ చదువుతున్నంతసేపు నా కళ్ళ ముందు ప్రతీ పాత్ర జీవం పోసుకొని తిరుగాడాయి. ఎవరూ ఊహించని ఒక చిన్న థీము తీసుకొని మీరు కథగా మలిచే తీరులోనే మీ శైలి ప్రస్ఫుటమౌతోంది. ఈ కధలో మమేకమైపోయిన ఉభయగోదావరి జిల్లాల యాసను పలికించిన తీరు అద్భుతం 'సోహం'లో కూడా మీరు అల్లుకొన్న కథ, పాత్రలను నడిపించిన తీరు చూస్తే ఈ విషయం అవగతమౌతోంది. 'మేనిక్వీన్' అనే కథ వ్యాపారాత్మకమైన మనుష్యుల మనుగడ, ఉరుకులపరుగుల జీవన శైలికి అలవాటు పడిపోతున్న భారతీయ సమాజం, అందులో అందమనేది వస్త్రాలలో, అలంకరణలలో ఉంటుందని నమ్మి, ఉదాత్తమైన భారతీయ సంస్కృతిని విస్మరిస్తూ పాశ్చాత్య ధోరణలను ఏ మాత్రం సంశయించకుండా అనుకరించడానికి ప్రయత్నిస్తున్న యువత ఒకవైపు అయితే మరోవైపు ఇంకా మానవత్వాన్ని నిలుపుకొని, సంస్కృతిని ఊపిరిగా ఎద పీల్చుకొని, ఆడది అంగడి బొమ్మ కాదన్న నిజాన్ని నిరూపిస్తూ, కళ్ళుమూసుకొని పోయిన ఈ సమాజానికి దృష్టి ప్రసాదిస్తున్న రాజయ్యలాంటి మనుషులు ఎక్కడో ఒకచోట ఉంటారన్న నమ్మకాన్ని కలిగిస్తున్న మీ కథకు జోహార్, మీకు ధన్యవాదాలు. -5. , RJUKT-Basara. ''మేనిక్వీన్' చాలా బావుంది. కథలోని రెండు పేటల్ని చాకచక్యంగా పేనారు. చివరి అనుభవం ద్వారా చైతాలీ ఏమైనా పాఠం నేర్చుకుందో లేదో గానీ రాజయ్య ఉన్నత వ్యక్తిత్వాన్ని చక్కగా మలిచారు.. -నారాయణస్వామి, USA తెలుగు వెలుగులో ప్రచురింపబడ్డ మీ కధ 'అన్వేషి' చదివాను. చాలా డెప్త్ ఉన్న కధ. అమ్మా నేను చలంగారికి జూనియర్ని, వారు రాసిన జీవితాదర్శం నవలలో భీమిలి గురించి, భీమిలి బీచ్ గురుంచి తెలిసే ఉంటుంది. అతిశయోక్తి కాదమ్మా! నాకు ఒక్కసారి మనసు పొరలలో దాగిన అనాటి రోజులు గుర్తుకొచ్చాయి. ఈ వయసులో నాకు ఆ తీపి జ్ఞాపకాలు కదమ్మా. మిగిలి ఉన్నవి అవి నీ ద్వారా బయటకు వచ్చాయి. ధన్యవాదాలు, -రమణమూర్తి, కాకినాడ. తడి ఆరని బంధం కథలో గురుశిష్యుల అనుబంధం, పకృతి సిద్ధమైన చిన్న పిల్లల ఆటపాటలు చాలా చక్కగా వర్ణించారు. చిన్ననాటి స్కూల్ వాతావరణం కాస్త కుదిపినట్లుగా ఉంది. వెంకట్ నిరంజన్ కుమార్ బొబ్బా, Kuala Lumpur, Malaysia. 5 ໖ ວົງ Story is very nice, Narration is clear & to the point. Inspiring story!!....