
VEDA GANITHAMU - 60
₹60
In stock · 554 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
డా॥ తోటకూర సత్యనారాయణరాజు ఎమ్.యస్ సి., ఎమ్.ఇడి., పిహెచ్.డి. లెక్కల టీచర్లందరూ లెక్కలు బోధిస్తారు కాని లెక్కలోకి వచ్చే లెక్కల టీచర్లు చాలా అరుదనే చెప్పాలి. అటువంటి అరుదైన వ్యక్తి, సహృదయులు డా॥ తోటకూర సత్యనారాయణరాజు భీమవరం తాలూకా ఉండి గ్రామంలో జన్మించారు. భీమవరం డి.యన్.ఆర్. కాలేజీలో లెక్కల లెక్చరర్గా పని చేసిన శ్రీ రాజు గారు అదే కాలేజీలో డిగ్రీ స్థాయి వరకు చదివారు. బెనారసు హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎం. యస్సి. (గణిత శాస్త్రం) డిగ్రీ పొందారు. శ్రీ రాజు గారు గణిత విజ్ఞానంలో స్వయంకృషితో ఎంతో ఎత్తుకు ఎదిగారు. గణితం ఆబాలగోపాలం హాయిగా నేర్చుకునేందుకు ఎన్నో నూతన ప్రక్రియలను రూపొందించారు. టి.వి.లోనూ, రేడియోలోనూ, లయన్స్, రోటరీ సమావేశాలలోనూ, విద్యాసంస్థలలోనూ నూతన పద్ధతుల ద్వారా గణితం మీద ఆసక్తి కలిగించుటకు ప్రయత్నిస్తున్నారు. దేశమంతటా అనేక సదస్సులలో పాల్గొన్నారు. యు.జి.సి. ప్రోగ్రామ్స్ ద్వారా గణితంపై అనేక ప్రోగ్రామ్స్ యిచ్చారు. ప్రస్తుతం అమెరికాలో వుంటూ గణితశాస్త్రంలో ఉపన్యాసాలు, ప్రసంగాలు, పరిశోధనలు చేస్తున్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన వీరి రచనలు * అంకెలతో ఆటలు * గణిత విజ్ఞానము * చేతివ్రేళ్ళే కంప్యూటర్లు * అందరికీ గణితం * వేద గణితము MATHS FOR FUN