VEDANTA PADA DARSHINI by RAMALINGESWARA RAO Telugu book cover

VEDANTA PADA DARSHINI

by RAMALINGESWARA RAO

₹60
In stock · 70 available
PublisherRAMALINGESWARA RAO
LanguageTelugu
నా మనవి “భోగేరోగభయం కులే చ్యుతిభయం విత్తేనృపాలాద్భయం మానే దైన్యభయం బలేరిపుభయం రూపే జరాభయమ్ శాస్త్రే వాదభయం గుణేఖలుభయమ్ కాయే కృతాన్తాద్భయమ్ సర్వం వస్తుభయాన్వితమ్ భువినృణాం వైరాగ్యమేవా భయమ్” ఈ జగతిలో పైనున్న తొమ్మిది భయాల్తోపాటుగా మనిషికి అన్ని వస్తువులూ భయాన్వితమై యున్నాయి. కేవలమూ వైరాగ్యము మాత్రమే అభయ ప్రదాయనిగా ఉంది. ఈ వైరాగ్య సాధనకు గురూపదేశము, సజ్జనసాంగత్యము, శాస్త్రవిచారణ, పురుష ప్రయత్నము అత్యంతావశ్యకములని చెప్పబడినవి. ఈ ఆలోచనాక్రమములో కేవలమూ భగవత్ప్రేరితముగా ఈ “వేదాంతపదదర్శిని" అను యీ చిన్ని సంకలనాన్ని వెలువరించడమైనది. వేదాంతం అత్యంత గహనమైన అనంత దుర్గమారణ్యం లాంటిది. సరళమైన వ్యాఖ్యానగ్రంథాలు లభించినవి కొన్ని పఠించి కేవలమూ జీవాత్మ ఆత్మ లాంటి పడికట్టు పదాలు కాకుండా విశేషార్థాలూ, వేదాంతార్థాలు గల కొన్ని పదాల్ని సేకరించి జనబాహుళ్యానికి అర్థమయ్యే సరళమైన రీతిలో ఈ సంకలనం చేయడమైనది. ఇది పద నిఘంటువు కాదు. సమగ్ర రచన కూడ కాదు. ఒక పదానికి అనేకార్థాలున్నా యిందులో ప్రతిపాదించినవి నాకు లభించిన గ్రంథాల లోనివి మాత్రమే పేర్కొనడమైనది. ఈ ప్రయత్నంలో వేదాంత పదాల సముచ్ఛయానికి సంబంధించిన గ్రంథాలు ఎక్కువగా నాకు లభించలేదు. శ్రీయల్లంరాజు శ్రీనివాసరావుగారి “వేదాంతపరిభాషా వివరణము” నాకు మిక్కిలి ఉపకరించింది. అందులో జనబాహుళ్యంలో వాడుకలో లేని కొన్ని పదాల్ని సేకరించి యిందులో జతచేయడమైంది. అట్లే శ్రీవిద్యా ప్రకాశానందగిరి స్వామివారి గ్రంథాలు కూడా ఎంతో ఉపకరించాయి. వారికి నా కృతజ్ఞతలు.