VEDANTHA PARAMANU SATRAMULA SAMYAMULU by DR.AVANTSA VENUGOPALA RAO Telugu book cover

VEDANTHA PARAMANU SATRAMULA SAMYAMULU

by DR.AVANTSA VENUGOPALA RAO

₹25
In stock · 1 available
PublisherDR.AVANTSA VENUGOPALA RAO
LanguageTelugu
పరిచయము - పీఠిక ప్రపంచ చరిత్రనూ నాగరికతలోని మార్పులను నిశితంగా పరిశీలిస్తే మానవులు మృగప్రాయుల వలె జీవించిన స్థాయి నుండి దిన దినాభివృద్ధి చెందుతూ ప్రకృతి శక్తులను తమకు అనుకూలముగ మలచుకొంటూ ముందుకు సాగుతున్నారని విశదమవుతోంది. ఈ పురోగతిలో భౌతిక (ప్రాపంచిక), పారమార్థిక విషయాలలో అనేకానేక విషయాలు వాటి వాటి గంభీరమయిన లోతులలోనికి పరిశీలింప బడ్డాయి, పరిశీలింప బడుతున్నాయి. అనేకానేక నిగూఢములయిన విషయాలు బయల్పడు తున్నాయి. తరచి తరచి పరిశీలించిన కొలదీ ఆ విజ్ఞాన గనులు అనంతములయి బృహత్తరంగా వ్యాపిస్తున్నాయి. ఏ ఒక్క విషయమూ పూర్వాపర విషయములతో సంబంధము లేకుండా అనగా కారణ కార్య సంబంధము లేకుండా జనించదన్న విషయము తేటతెల్లమవుతోంది. మేడమెట్లు ఎక్కునపుడు మొదటి మెట్టుకు రెండవమెట్టుకూ, రెండవమెట్టుకు మూడవమెట్టుకూ అలాగే తదుపరి వరుస మెట్లుకు కూడా ముందు మెట్టుతో సంబంధం సహజంగా వుంటుంది. ఈ విషయాన్ని “కపిలమహర్షి” కారణ కార్య పరంపరల సంబంధముగా అభివర్ణించాడు. ఈ గొలుసుకట్టు ఎప్పుడు ప్రారంభమయిందో ఎప్పుడు అంతమవుతుందో తెలియదు. కాని యివి ఋజుమార్గములలో సాగిపోతూ వుంటాయి. అంతేకాక యీ ఋజుమార్గాలు వలలోని దారాల వలె అల్లుకొనిపోయి ఒకే కారణం నుండి అనేక కార్యములు ఒకే కార్యము నుండి అనేక కారణాలు జనించుతు పోతాయి. ఈ ప్రక్రియలో మానవుడు ప్రారంభంలో ప్రకృతిలోని విషయాలను అవగాహన చేసుకోవడంలో ఆ విషయముల వెనుక ఏవో అజ్ఞాత శక్తులు వున్నాయని భావించి వానిని దేవుళ్ళుగా పిలవనారంభించాడు. తరువాత వాటిని తర్క శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని విచక్షణా జ్ఞానతో సత్యా సత్య నిర్ణయాలను చేస్తూ అన్వేషణను నిరంతరం కొనసాగిస్తున్నాడు. కలరా, మశూచి తదితర భయంకర రోగాల వెనుక వున్న కారణాలు భౌతికమైనవని తెలుసుకున్నాడు.