VEDANTHA VIGNANA VEECHIKALU PHASE - 2 by AMMU ANNAJEERAO Telugu book cover

VEDANTHA VIGNANA VEECHIKALU PHASE - 2

by AMMU ANNAJEERAO

₹25
In stock · 2 available
PublisherAMMU ANNAJEERAO
LanguageTelugu
రచయిత మనసులో మాట ప్రపంచమొక పెద్ద పద్మవ్యూహం. ఈ శరీరం ఒక చిన్న పద్మవ్యూహం. మనం అభిమన్యులమైతే చావుతప్పదు. "అనగా దేహాభిమానం గలవాడే అభిమన్యుడు" మనం అర్జునులమైతే మృత్యువు నుంచి తప్పించుకుంటాం (అభిమన్యుడికి పద్మవ్యూహంలో ప్రవేశించడమే తెలుసు, బయటకు రావడం తెలియదు అదే కృష్ణుని మాయ) అలాగే జీవుడికి ప్రపంచంలో చొరబడటమే తెలుసు అంచేత పరమాత్మను పట్టుకుని బయటకు తప్పించుకో. ఈ ప్రపంచమే "మయసభ” (మాయాసభ) ఈ మాయామయ ప్రపంచం అనే పద్మవ్యూహం నుంచి రక్షించమని కరావలంబం ఇమ్మని శ్రీలక్ష్మీనృసింహణ్ణి ప్రార్థించి తరించు” సంసార సాగరనిమజ్ఞనముహ్యమానం” “లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబం.” (ఈ స్తోత్రం బాగా చదవండి). "ఆత్మ" ఒక "Internet" అన్నిటినీ Connect చేసి చూపిస్తుంది. నీ Mind దానికి Connect చెయ్యి అదే ధ్యానం, ໙໖ Meditation, ໑໖ “” ໙ Internet Open 5 Pass-word ఉండాలి. అదే "తత్త్వమసి" అది లేకుంటే Open అవదు. నీ File కనబడదు. భగవంతుడు మనకు నాలుగు ఈ-మెయిల్స్ పంపాడు. అవి ఏమనగా: 1) బాల్యం, 2) యవ్వనం, 3) వృద్ధాప్యం, 4) మరణం. దేనికి? నీవు జాగ్రత్తపడి ఈ సంసారం లోంచి బయటపడతావని. ఆత్మ-సామాన్యం, మైండ్-విశేషం. విశేషాలు అన్నింటిని సామాన్యంలో లయం చేయి, అదే ధ్యానం, అదే నిదిధ్యాస!! మనం పూర్తిగా వేదాలుగాని, వేదాంతశాస్త్రాలుగాని, పురుణాలుగాని కష్టపడి చదివినా, అర్థంకాని కొన్ని లోతులు, మెలకువలు శ్రీశంకరుల వారి భాష్యంలో, శ్రీగీతాచార్యులవారి, గురుపరంపరాగతమైన ఆగమంద్వారా అందించిన ఉపదేశాలను నేను శ్రమపడి క్రోడీకరించిన రత్నాలను నేను ఒక్కడినే కాక భక్తజనులందరికి అందివ్వాలనే తపనతో ఈ వ్యాసాలను, కథలను వ్రాయడమైనది. ఇందు పొందుపరచిన వ్యాసంగాని కథగాని, శాంకర భాష్యపంక్తులుకాని, అన్నీ నీకు అపరోక్షానుభవం అనగా Instant Coffee లాగ Instant ముక్తిని ప్రసాదించేవే. మీ భక్తజన విధేయుడు... అమ్ము అన్నాజీరావు