
VEDURU PUVVU
₹150
In stock · 215 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Vedurupuvvu short stories by Madhurantakam Narendra 1957లో చిత్తూరు జిల్లా దామల్చెరువు దగ్గరి రవణయ్యగారిపల్లెలో జన్మించిన మధురాంతకం నరేంద్ర ప్రస్తుతం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల శాఖలో ఆచార్యుడుగా పనిచేస్తున్నారు. దాదాపుగా 80 కథలు, 4 నవలలు, చాలా కవితలు, కొన్ని రేడియో నాటికలు, కొన్ని విమర్శనాత్మక వ్యాసాలూ రాశారు. ఆయన కథల్లో కొన్ని- 'కుంభమేళా', 'ఆస్తిత్వానికి అటూయిటూ'... 'రెండేళ్ల పద్నాలుగు' అనే మూడు కథా సంపుటాలుగా వెలువడ్డాయి. కథా రచనకు అనేక సాహితీ పురస్కారాలు పొందారు. రచయిత తన శైలిని ఎప్పటికప్పుడు ఛేదించుకుంటూ కథా రచన చేయటం ద్వారా తన రచనా ప్రవాహాన్ని నిత్యనూతనంగా నిరంతరాయంగా కొనసాగించడం సాధ్యమవుతుంది. ఈ లక్షణం మధురాంతకం నరేంద్రలో పుష్కలంగా ఉంది. 'రెండేళ్ల పధ్నాలుగు' కథా సంపుటిలోని కథలతో అప్పటివరకూ ఉన్న తన శైలిని తానే ఛేదించుకుని నూతన ధోరణిలో కథా రచన సాగిస్తున్నారు. తన శైలిద్వారా పాఠకుడిని కథ లోతుల్లోకి తీసుకెళ్లడంతో పాటూ అది పాఠకుడిని నిత్యం వెంటాడే కథగా రూపొందించటంలో నరేంద్రది ప్రత్యేక శైలి. ఇందు కోసం చిన్న చిన్న విషయాలను సైతం వదలకుండా పరిసరాలను, పాత్రల స్వరూప స్వభావాలను, హావభావాలను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా రచయిత దీన్ని సాధించగలిగాడు. నరేంద్ర ఎంచుకున్న కథా వస్తువు, కథలోని పాత్రలు మనల్ని నిత్యం వెంటాడుతూనే ఉంటాయి. కథా రచనలో నరేంద్ర సాధించిన పరిణితికి నిదర్శనం ఈ కథలు. - వాసిరెడ్డి నవీన్, కథా సాహితి సంపాదకులు నరేంద్ర కథల్లో బహుళ ప్రపంచం కనిపిస్తుంది. అతడి కథా వస్తువులు సమకాలీన భారతదేశ భాషా సామాజిక సంస్కృతులు, చరిత్ర అంత సంక్షీర్ణమైనది. అతడి కథల నేపథ్యంలో ప్రకృతి, పరిసరాలు, సమాజం, దామలచెరువు, తిరుపతి దాటి గోదావరి, పాపికొండలు, చిరపుంజి శిఖరాలు, గంగా బ్రహ్మపుత్ర నదీపరీవాహిక ప్రాంతాలు దాటి మెక్సికో వరకూ విస్తరిస్తాయి. నరేంద్ర సామాజిక చింతనాశీలిగా, ఉద్వేగాలకు లోనుగాని అన్వేషిగా మనస్తత్వ పరిశీలకుడిగా పరిచయమవుతాడు. - ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ట్ర పబ్లిషిం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004.