VEECHINA PRANTEEYA PAVANALU by R.J.RAJENDRA PRASAD Telugu book cover

VEECHINA PRANTEEYA PAVANALU

by R.J.RAJENDRA PRASAD

₹120
In stock · 74 available
PublisherR.J.RAJENDRA PRASAD
LanguageTelugu
ఆముఖం అందరికీ ఎన్.టి.ఆర్ చిరపరిచితులైన నందమూరి తారకరామారావు తన 60వ ఏట రాజకీయాల్లో ప్రవేశించి తెలుగుదేశం పార్టీని నెలకొల్పి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రనే మార్చివేసి నూతనచరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా సుమారు ఏడున్నర సంవత్సరాల కాలం పాలించారు. 1989 సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నేషనల్ ఫ్రంట్కు చైర్మన్గా వున్నారు. అన్నిటికీ మించి రాష్ట్రరాజకీయాలకు కొత్త ఒరవడిని దిద్ది తనదైన ముద్ర వేశారు. ఆ ఒరవడిని కొనసాగించిన తెలుగుదేశం పార్టీ 21ఏళ్ళకాలంలో ఎన్.టి.ఆర్. ఆయన అల్లుడు చంద్రబాబునాయుడు 16ఏళ్ళపాటు అధికారంలో ఉండడం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం. సంక్షిప్త రాజకీయ సమీక్షతో పాటు ఎన్.టి.ఆర్, చంద్రబాబునాయుడుల ఆలోచనల్ని ఈ పుస్తకం అందిస్తుంది. ఇది ఎక్కువ మటుకు వివరణాత్మకమైంది. ఒక విద్యావేత్తగా కాక పత్రికారచయిత దృక్కోణంతో రాసిన పుస్తకం. నేను 1971 నుంచి 30ఏళ్ళ పాటు 'దిహిందూ' హైదరాబాద్ బ్యూరోచీఫ్ గా పనిచేశాను. ఇందులో పొందుపరచిన సంఘటనలను సన్నిహితంగా చూశాను. 30ఏళ్ళ సినిమా జీవితాన్ని వదిలి రాష్ట్ర రాజకీయ రంగంలో పాదం మోపిన ఎన్.టి.ఆర్. తొలుత అనుభవం లేనివారే. అయినా సరైన సమయంలో రాజకీయ తెరపై ప్రత్యక్షమయ్యారు. 1982లో హైదరాబాద్ విమానాశ్రయంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాజీవ్ంధి చేతుల్లో ముఖ్యమంత్రి టి. అంజయ్య అవమానం పొందిన ఘటనను చూపి తెలుగువారి ఆత్మగౌరవ నినాదమిచ్చారు. 1982 నాటి పరిస్థితి భవనం వెంకట్రామిరెడ్డి నాలుగేళ్ళలో మూడవ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. నాలుగో ముఖ్యమంత్రి ఐదునెలల్లోనే వచ్చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో తగవులాడుకుంటున్న కథనాలు, పత్రికల నిండా చోటు చేసుకుంటున్నాయి. "తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారు" "మేము ఎవ్వరి బ్రాంచ్ ఆఫీసు కాము” “కాంగ్రెస్ (ఐ) క్విట్ ఆంధ్రప్రదేశ్" వంటి నినాదాలతో ప్రజల్ని ఆకట్టుకున్నారు.