VEERABRAHMENDRA SWAMI JEEVITHA CHARITRA - 70 by K.VEERABRAHMACHARI Telugu book cover

VEERABRAHMENDRA SWAMI JEEVITHA CHARITRA - 70

by K.VEERABRAHMACHARI

₹70
In stock · 1 available
PublisherSRI BALAJI PUBLICATIONS
LanguageTelugu
శ్రీ మద్విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర మొదటి ప్రకరణము 1. శ్రీ వీరబ్రహ్మంగారి అవతార నేపథ్యం అది విజయనగర సామ్రాజ్యము వైభవముగా వెలుగొందుచున్న కాలము. అయినప్పటికీ ఆనాటికీ కలి ప్రభావము ఎక్కువయై ధర్మమునకు హానికలుగుట ప్రారంభమైనది. అన్యమతముల వారి దౌష్ట్యముల వలన గో, శిశు హత్యలు, స్త్రీల అత్యాచారాలు మిక్కుటముగా జరుగుచ్నువి. మ్లేచ్ఛుల ఆక్రమణలోని రాజ్యాలలో దేవాలయములన్నీ విధ్వంసము గావించబడినవి. దినదినమునకు పాపులసంఖ్య అధికముగా జొచ్చెను. ఇటువంటి పరిస్థితులను చూచి ధర్మదేవత ఎంతో వ్యధచెందుతూ ఒకనాడు వైకుంఠములోని శ్రీహరివద్దకు వెళ్ళి స్వామితో! భూలోకములో జరుగుచున్న ఆకృత్యములన్నీ ఏకరువుపెట్టి ఆయనను తిరిగి భూమిమీద దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసము అవతరించమని ప్రార్ధించినది. భూదేవి ప్రార్థనను ఆలకించిన విష్ణువు ఆమెకు అభయమిచ్చి ఆమె కోరిన విధముగానే భూమిపై అవతరించెదనని మాటఇచ్చి ఆమెను సాగనంపెను. అతదుపరి శ్రీహరి సత్యలోకవాసియైన బ్రహ్మదేవుని, కైలాసపతియైన పరమేశ్వరుని, తన సన్నిధానమునకు పిలిపించి, వారితో 'ఓ బ్రహ్మా! శంకరులారా! మనకు ఈకలియుగములో తిరిగి అవతారం ధరించవలసిన అవసరము ఏర్పడినది.