VEERESALINGAM SAMKSHIPTA JEEVITHA CHARITRA by DR.AKKIRAJU RAMAPATHI RAO Telugu book cover

VEERESALINGAM SAMKSHIPTA JEEVITHA CHARITRA

by DR.AKKIRAJU RAMAPATHI RAO

₹45
In stock · 223 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
జననం, బాల్యం, విద్యాభ్యాసం ఏనాటిదో గోదావరి! వేదకాలం నాటిది కావచ్చు!! కవులూ, పండితులూ, కళాకారులూ, కథానాయకులు, గోదావరీ తీరాన్ని రంగస్థలం చేసుకొన్నారు. కావ్యాలు వ్రాశారు, గళమెత్తి పాడారు. ఆ ఇసుక తిన్నెల్లో, ఆ ఏటి జాలుల్లో, అక్కడి పాఠశాలల్లో వాళ్ళ వ్యక్తిత్వాలు దిద్దుకొన్నారు. ఏనాటిదో రాజమహేంద్రవరం! భారతీయ నగరాలలో పురాతనమైనదే అయినా, ప్రతిసారీ అధునాతన భావాలను అందించింది. తెలుగుదేశానికి కొత్త చవు లిచ్చింది. కొత్త కవుల నిచ్చింది. రాజరాజ నరేంద్రుడు భారత రచనకు శ్రీకారం చుట్టించాడు నన్నయ్య చేత. తొమ్మిది వందల ఏళ్ళు, కావ్య మార్గం, గోదావరిలా అవిచ్ఛిన్నంగా సాగుతూ వచ్చింది. మళ్ళీ గోదావరి ఒడ్డుననే వీరేశలింగం జన్మించాడు. తెలుగు సాహిత్యానికి కొత్త వరవళ్ళు దిద్దాడు. గోదావరి కొత్త పరవళ్ళు పోయినట్లుగా, కొత్త రూపురేఖలు సంతరించాడు. తెలుగుజాతి తల ఎత్తుకొనేట్లు చేశాడు. కందుకూరి చంద్రమౌళిగారని ఒక సంపన్న గృహస్థు. వాళ్ళది ఏలూరు. ఆయన పుట్టి, పెరిగి పెద్దవాడైనదాకా, ఆ కుటుంబం వాళ్ళది 'వెర్రిశైవం', ఆ శైవం బాగా ముదిరిపోయిందికూడా. అయితే చంద్రమౌళిగారు నిలువుబొట్టు వాళ్ళ పిల్లను పెళ్ళి చేసుకొన్నాడు, తాను అడ్డబొట్టు వాడైననూ. ఈ చంద్రమౌళిగారికి కొడుకు పుట్టాడు. తరతరాలనుంచి శైవ సాంప్రదాయమే కాబట్టి, ఆ కొడుక్కు వీరేశలింగమని పేరు పెట్టాడు. ఈ వీరేశలింగం గొప్ప వ్యవహర్త, చాలా తెలివికలవాడు. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేశాడు. ఉద్యోగరీత్యా ఆయన ఏలూరు వదిలిపెట్టి రాజమండ్రి చేరుకొన్నాడు. లంకంత ఇల్లు కట్టాడు. ఆయన మెళ్ళోని లింగకాయను తీసివేశాడు. వీరశైవులంతా మెడలో లింగకాయలు కట్టుకొనేది వాడుక. మోత బరువు తప్పింది. మేనమామలు నిలువుబొట్లు వాళ్ళాయె! తల్లి ప్రోత్సాహమో, మామయ్యలు చెప్పారో కుటుంబంలో సంస్కరణ దృష్టి ప్రారంభమైంది. ఈ వీరేశలింగం గారికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు వెంకటరత్నం, రెండో అతను సుబ్బారాయుడు. వీరేశలింగం చాలా డబ్బు సంపాదించాడు. గొప్ప కీర్తి సంపాదించాడు. అయినా చూడలేని వాళ్ళ చాడీలవల్ల ఉద్యోగం పోగొట్టుకున్నాడు. పెద్దకొడుక్కు పెళ్ళి చేశాడు. కోడలు కాపరానికి రాకుండానే కాలం చేసింది. ఆడపిల్లను కని ప్రేమాస్పదురాలైన తోబుట్టువు కన్ను మూసింది. ఎన్నో కష్టాలు. ఆయన కన్ను మూశాడు. ఆయన తల్లి అక్కమ్మగారు బ్రతికే ఉన్నది. భార్య కావమ్మగారు బ్రతికిఉంది. వీరేశలింగంగారు వెళ్ళిపోయినారు. చింత చచ్చినా పులుపు చావలేదు. పూలమ్మినచోట వీరేశలింగం జీవిత చరిత్ర డా॥ అక్కిరాజు రమాపతిరావు