
VELUGU BATALU-60
₹60
In stock · 20 available
PublisherSAROJAROY COMMUNICATIONS
LanguageEnglish
మహా పురుషుల జీవిత చరిత్రలు పిల్లల మనసులను బాగా ప్రభావితం చేస్తాయి. ఒక ఉన్నత వ్యక్తి జీవిత చరిత్రను పిల్లలకు తెలియజేస్తే తాము కూడా అలా చేసి పేరు తెచ్చుకోవాలనే కోరిక కలుగుతుంది. మహాపురుషుల ఆదర్శాలు, ఆశయాలు పిల్లల జీవితాలను ప్రేరేపిస్తాయి, దాని నుంచి తామూ అలా ఆదర్శంగా జీవించాలనే ఆలోచన కూడా బయలుదేరుతుంది. గాంధీ, నెహ్రూ వంటి వారి జీవిత చరిత్రలు చదివి ప్రభావితులై పట్టుదలను, దీక్షను అలవరచుకుని నాయకులైన వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఛత్రపతి శివాజీ చిన్నప్పుడు తన తల్లి తనకు విపిపించిన పురాణ పురుషుల సత్కార్యాల వల్ల ఉద్బోధితుడయి దేశరక్షణకు కంకణం కట్టుకున్నాడు. శివాజీకి స్ఫూర్తిని కలిగించింది వెనుకటి మహాపురుషుల జీవిత కథలే! ఏ కాలం వారయినా, ఏ దేశం వారైనా మహాపురుషుల జీవితాలు ప్రతివారికీ ఆదర్శప్రాయమైనవే. అనుసరించదగ్గవే. పిల్లల్లో నైతిక విలువల విద్యను నేర్పే క్రమంలో ప్రముఖుల జీవిత చరిత్రల పుస్తకాలు చదివించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ దృష్టితోనే ప్రముఖ బాల సాహితీ రచయిత చొక్కాపు వెంకటరమణ కొందరు తెలుగు ప్రముఖుల జీవిత చరిత్రలను సంక్షిప్తంగా 'వెలుగు బాటలు'గా పిల్లల కోసం ప్రత్యేకంగా రాశారు. ఇది పెద్దలకు, పిల్లలకు ఎంతో ఉపయుక్తమైన పుస్తకం