VELUGU DAARULU by DR.NANDAMURI LAKSHMI PARVATHI Telugu book cover

VELUGU DAARULU

by DR.NANDAMURI LAKSHMI PARVATHI

₹100
In stock · 54 available
PublisherN.T.R.EDUCATIONAL SOCIETY
LanguageTelugu
ముందుమాట 'భాయాం రతా భారతా' కాంతిలో రమించే దేశమే భారతదేశం. Where westran phylosaphy ends begain estran phylosaphy అంటారు స్వామి వివేకానంద పాశ్యాత్య జ్ఞానం ఎక్కడ ఆగి పోతుందో అక్కడ నుండి భారతీయ జ్ఞానం మొదలవుతుంది. అనే మాట అక్షర సత్యం. అన్ని మతాలకు ప్రవక్తలున్నారు. కాలపరిమితివుంది. కాని భారతీయ ధర్మానికి ప్రత్యేకంగా ఒక ప్రవక్త కాని, ఒక్క మతమని గాని ఒక ప్రామాణిక గ్రంధమనిగానీ చెప్పబడలేదు. 'యేయధా మాం ప్రపద్యస్తే తాంస్తధైవ భజామ్యహమ్' అని గీతాచార్యుడు చెప్పినట్లు ఎవరు ఏ రూపంలో ఎలా ఆరాధిస్తే ఆరూపంలో ఆ విధంగా దేవుడు పలికాడని మన భగవద్గీత చెబుతున్నది. అన్ని మతాలను, సంస్కృతులను తనలో విలీనం చేసుకుని సమగ్రమైన సిద్ధాంతంగా రూపుదాల్చి ఎవరికేదికావాలో అది ఇస్తూనేవుంది. ఈ జ్ఞానగంగ త్రాగగలిగినవాడికి త్రాగినంత దొరుకుతూనేవుంది. దీని మూలాలు ఎక్కడ ప్రారంభమయ్యాయో ఇంతవరకు తెలియదు. కాని కాలాతీతంగా సర్వమానవాళి ఆచరించ దగిన అద్భుత సూత్రాలనెన్నిటినో సమాజానికి కందించింది. సమస్త జనులు సుఖసంతోషాలతో విలసిల్లాలని చెప్పే ఆదర్శ ధర్మం హిందూధర్మం. సమస్తంలో భగవత్తత్త్వాన్ని ఆవిష్కరించి పామరుడిని సైతం భగవంతుడి దగ్గరకు చేర్చగలిగింది ఈ ధర్మం. అటువంటి ఈ జ్ఞానసింధువులో ఎన్నో ఆధ్మాత్మిక బిందువులు. ఆ అమృతరసంతో తడిసి పునీతమైన భారత భూమి మీద ఎంతోమంది మహానుభావులు ఆవిర్భవించారు. వారు తరించారు, జాతిని తరింపజేసారు. అటువంటి మహానీయుల జీవితాలను మాలగాకూర్చి జిజ్ఞాసులకు అందించాలనేదే చిన్న ప్రయత్నం. అయితే జ్ఞానమణులన్నిటిని ఏరటం సాధ్యం కానిపని. లభించిన కొద్దిమంది జీవితాలనే 'వెలుగుదారులుగా' ఆంధ్రభూమి ఆదివారం పత్రికలో ప్రత్యేకవ్యాసాలుగా ప్రచురించటం జరిగింది. దాదాపు ఒక సంవత్సరం ఆరు నెలలపాటు క్రమం తప్పకుండా వచ్చిన ఈ శీర్షికకు వచ్చిన స్పందన అపూర్వం- నాలోని రాజకీయవేత్తను కూడా పక్కనపెట్టి ఒక ఆధ్యాత్మికవేత్తగా గుర్తించి ఆదరించిన వారెందరోవున్నారు - ఆ అనుభవాలు స్థలాభావంవల్ల చెప్పలేక పోతున్నాను.