
VELUPILLAI KATHA SAMPUTI-55
₹55
In stock · 2 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. వేలుపిళ్లై రెట్టింపు బరువు వేసుకుని, లారీ మూలుగుతూ కొండ ఎక్కి ఎస్టేటు పెద్దబజార్లో ఆగింది. పేరుకి పెద్దబజారు కాని ప్రొస్పెక్ట్ టీ ఎస్టేటు పెద్దబజార్లో నాలుగే నాలుగు దుకాణాలు. రెండు కిరణా దుకాణాలు, ఒక కాఫీ 'క్లబ్బు'. నాలుగో దుకాణంలో ఒక భాగం మంగలిషాపు. రెండోభాగం జోళ్ళషాపు, దుకాణాల్లో మనుష్యులు గుమ్మంలోనుంచి బయటికి తొంగిచూసి, “సామాన్లు వచ్చాయ్” అన్నారు. డ్రైవరు దిగి గాలికి లారీ ఇంజను చల్లారడానికి బోనెట్ తెరిచిపెట్టాడు. రెండోపక్క గోపాల చెట్టియార్ కులాసాగా నవ్వుతూ కిందికి దూకాడు. అప్పటికప్పుడే రోడ్డుప్రక్కల కబుర్లు చెప్పుకుంటున్న పనిలేని కుర్రాళ్ళు అయిదారుగురు లారీ చుట్టూ మూగారు. "ఏరా శనిగ్రహాల్లారా, అప్పుడే నేనొచ్చినట్లు పసికట్టేశారా? అని గట్టిగా నవ్వాడు పాల చెట్టియార్. లాల్చీ జేబులో నుంచి ఒక కట్టబీడీలు పైకితీసి తలో నాలుగూ వంచిపెట్టాడు.