VENDI VELUGULU by CHEEKOLU SUNDARAIAH Telugu book cover

VENDI VELUGULU

by CHEEKOLU SUNDARAIAH

₹60
In stock · 17 available
PublisherRANJANI
LanguageTelugu
పాతికేళ్ల నిత్య కవితా వసంతం... 1984..... కె.కె. మీనన్ రంజని అధ్యక్షుడిగా ఉన్న రోజులవి. ఓ రోజు ఆయన కుందుర్తి పేరుమీద ఏమైనా చేస్తే బాగుంటుందన్నారు. శిలావీర్రాజు తదితరులు తగిన మద్దతునిస్తారని ఆయన అన్నారు. అప్పటికి నేను ఆఫీసులో, రంజనిలో చేరి నాలుగు సంవత్సరాలే అయినా... గ్రంథాలయం, ప్రచురణలు, సభల నిర్వహణ నేనే చూస్తుండడంతో ఆయన ఆంతర్యాన్ని వెంటనే గ్రహించాను. రాష్ట్రస్థాయి మినీ కవితల పోటీలో బహుమతితో పాటు ఆచార్య తంగిరాల వేంకటసుబ్బారావు (బెంగుళూరు) అభినందనలు సైతం అందుకోవడం, హైదరాబాదులో జరుగుతోన్న పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుపొందడం... వంటి వాటి నేపథ్యంలో 'రంజని' కూడా పోటీలు నిర్వహించడం బావుంటుందని కార్యవర్గ సభ్యుల్ని ఒప్పించి శీలావీ సహకారంతో అవార్డుల కరపత్రం రూపొందించాం. అప్పట్లో ఆంధ్రప్రభ దోమలగూడలో ఉండేది. ఈనాడు సోమాజీగూడలో ఉండేది. మిగిలిన పత్రికలు ఒకటీ రెండు చాలా దూరంగా ఉండేవి. పత్రికల మిత్రుల్ని కలిసి సహకారం అడిగాం. వారంతా సహకరించారు. తొలిసారిగా 1984 అక్టోబరులో జంటనగరాల స్థాయిలో రంజని కుందుర్తి అవార్డుల నిర్వహణ తలపెట్టాం. అప్పుడు బహుమతి సొమ్మును కుందుర్తి తనయులు సత్యమూర్తి ఇస్తామన్నారు. నూట పదహారు రూపాయలు బహుమతి సొమ్ము. జంటనగరాల నుంచి రెండు వందలకు పైగా కవితలు అందాయి. కల్లూరి భాస్కరం కవిత 'మృత్యువే అమృతత్వం' ప్రథమస్థానం పొందింది. 'మనం అక్షరాలు రాయాల్సి వుంది' అనే కవిత ద్వితీయస్థానం పొందింది. అది ఆశారాజు కవిత.