VENNELA BALALA GEYALU by SIVVAM PRABHAKARAM Telugu book cover

VENNELA BALALA GEYALU

by SIVVAM PRABHAKARAM

₹25
In stock · 41 available
PublisherSIVVAM PRABHAKARAM
LanguageTelugu
ముందుమాట వెన్నెల కాంతి వంతంగా చల్లాగా ఆహ్లాదకరంగా ఉంటుంది. నిండు చందమామ నుండి వెదజల్లబడుతున్న వెన్నెల కాంతులు ఆబాల గోపాలానికి ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వెన్నెల శోభలో ప్రకృతి అందాలను అనుభవించని వారుండరు. వెన్నెల సౌందర్యాన్ని అనుభవించని వారుండరు. వయసు తారతమ్యాలుండవు. వెన్నెల వేళలో బాలలు ఆటలాడుకుంటుంటే వయసొచ్చిన కుర్రకారు నదీతీరాల్లోనో, సమద్ర తీరాల్లోనో ప్రకృతి అందాలను అనుభవిస్తూ పిల్లగాలులను పీల్చేటందుకు షికార్లు చేస్తుంటారు. ఇక పెద్దల విషయానికొస్తే వెన్నెల కాంతిలో గత కాలపు ముచ్చట్లతో కాలం గడిచిపోతుంది. వెన్నెల కాంతి, అది ఇచ్చే ఆనందం మనసును గగుర్పొడిచి కవిత్వాన్ని కూడా పుట్టిస్తుంది. ఆ కవిత్వం పాఠకుల గుండెల్లో శాశ్వతంగా నిలచిపోతుంది. అలానే ఈ ' వెన్నెల' పుస్తకంలో గల బాలగేయాలు చిన్నారుల గుండెల్లో హత్తుకు పోవాలనే ఆశతో వ్రాయడం జరిగింది ఇందులో గల 'మామిడిచెట్టు, అద్దం, రూపాయి, ఫేన్, గుడ్లగూబ, గంటలు, సబ్బుబిళ్ల, గడియారం, పనసపండు వంటి గేయాలు బాలలకు వాటి వినియోగం తెలియ జెప్పేటందుకు వ్రాయబడ్డాయి. బాలల ఐకమత్యమే వారి పురోభివృద్దికి, దేశ పురోభివృద్ధికి అవుసరమని తెలియజెప్పే గేయాలు, వారు చదు పుచున్న పాఠశాలల్లో జరుపవలసిన కార్యక్రమాలు గేయ రూపంలో తెలుప బడ్డాయి.