
VENNELA KIRANALU
₹50
In stock · 14 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
“పాపం ఆడపిల్ల?” “అమ్మా అల్లరీ !?" అమ్మపిలిస్తే వెనుతిరిగి చూశాను. నిజంగా నాపేరు అల్లరే. నేను ఎప్పుడూ అల్లరల్లరిగానే పెరిగాను. నా అల్లరి ఆగిపోతే నేను అలిగినట్లుగా బాధపడే అమ్మా నాన్నలకు నేను ఒక్కర్తినే గారాము కూతుర్ని. నా అల్లరి వింటూంటేనే అమ్మానాన్నలకు ఆకాశమంత ఆనందం. నాన్న కూలీ చేస్తూ ఇల్లు గడిపేస్తూంటే, అమ్మ టైలర్ చేస్తూ నన్ను చదివించింది. వారిద్దరి మధ్యన నేనొక ఆనందదాయినిని. నా చదువు పూర్తయ్యే సరికి నా వయసు 23 సం॥లు. సివిల్ ఇంజినీర్ లో ఎం.టెక్. పూర్తిచేశాను. ఓ ప్రైవేట్ కంపెనీలో జాబు దొరికింది. సంవత్సరం నిండేసరికి నా జీతం ముప్పైవేలు. అంతా మంచిగానే గడుస్తోంది. కానీ అమ్మా నాన్నలకే నా గురించి బెంగ పట్టుకుంది. ఎంతైనా ఆడపిల్లను గదా ? పెళ్ళిచేస్తే నన్నొదిలి వుండలేక, పెళ్ళి చేయకపోతే మనసు బాధను భరించలేక, ఇల్లరికం కావాలంటే నిలువ ఆస్థులులేక. మరీ అందంగా లేకపోయినా, ఆకర్షణగా వుండేందుకు ప్రయత్నిస్తుంటాను. సంబంధాలు వస్తూనే ఉన్నాయి. ఎంతైనా చదువుకున్నదాన్ని కదా ? కాసైనా తగ్గట్టుగా వుండాలని ఆశపడ్డాను. నెలకు 30వేల జీతం వస్తోంది. అయినా కట్నం వద్దనే; మనిషి నాకు కన్పించటం లేదు.