
VENNELAKANTI SUBBARAO JEEVAYATRACHARITRA
₹60
In stock · 12 available
PublisherDR.AKKIRAJU RAMAPATHI RAO
LanguageTelugu
ఇది మా రెండవ ప్రచురణ. వెన్నెలకంటి సుబ్బారావు జీవయాత్రా చరిత్ర. పరిశోధన గ్రంథం. ఇంచు మించుగా నూటయాభై సంవత్సరాలనాటి తెలుగుదేశాన్ని, ఈస్టిండియా కంపెనీ వాటి ప్రభుత్వ వ్యవస్థను తెలియజెప్పే గ్రంథం. అన్నిటికన్నా ముఖ్యమైనది తెలుగు మహాశయుడు వ్రాసిన స్వీయ చరిత్రలలో మొట్టమొదటిది ఇది. నూట నలభై సంవత్సరాల క్రితమే దీనిని ఆయన ఇంగ్లీషులో వ్రాశారు. నూట మూడేళ్ళ క్రితం మొదటిసారి అచ్చయింది. కాశీ, రామేశ్వర యాత్రల విశేషాలతోబాటు నాటి మేధావులైన, రాజకీయోద్యోగులైన ప్రతిభావంతులైన, తెలుగు పెద్దలను గూర్చి తెలుసుకోవలసిన సంగతులున్నాయి ఈ గ్రంథంలో, అనువాదకర్త డా॥ అక్కిరాజు రమాపతిరావును గూర్చి, తెలుగు సాహితీపరులకు కొత్తగా పరిచయం చేయవలసిన పని లేదనుకుంటాము. మేము కోరగానే దయతో తమ అభిప్రాయాలను అందించిన ఆచార్య శ్రీ మామిడిపూడి వెంకటరంగయ్య గారికి, విఖ్యాత చరిత్ర పరిశోధకులు శ్రీ దిగవల్లి వేంకట శివరావుగారికి, ఆంధ్రత్వము ఆంధ్రభాషా ప్రియత్వము మూర్తీభవించిన శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారికీ, వెన్నెలకంటి సుబ్బారావు జీవయాత్రా చరిత్రం తెలుగు పాఠకులు చదివే అవకాశం కలిగించిన శ్రీ ఎన్. ఎస్. కృష్ణమూర్తి గారికీ, విపుల పీఠికతో అనువాదకర్త కృషికి సార్థకత చేకూర్చిన కళాప్రపూర్ణ, పరిశోధన పరమేశ్వర, సాహిత్యరత్న, డా॥ నిడుదవోలు వేంకటరావు గారికి మా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. మా ఈ మలి ప్రచురణను కూడా తెలుగు దేశం ఆదరిస్తుందని విశ్వసిస్తున్నాము. ఇది శ్రీ భారతి ప్రచురణ.