VENNELAMMA KATHALU by KOKMARAVOLU SESHA SRI RAMACHANDRAMURTHY Telugu book cover

VENNELAMMA KATHALU

by KOKMARAVOLU SESHA SRI RAMACHANDRAMURTHY

₹160
In stock · 71 available
PublisherKOKMARAVOLU SESHA SRI RAMACHANDRAMURTHY
LanguageTelugu
క్షమాపణ "డౌన్ డౌన్" "డౌన్ డౌన్" తెలుగు సంస్కృతి పత్రిక డౌన్ డౌన్, తెలుగు సంస్కృతి ఎడిటర్ డౌన్ డౌన్, మహిళా హక్కుల్ని కాలరాచే పత్రిక డౌన్ డౌన్, మహిళా మండళ్ళ కార్యకర్తలు జిందాబాద్, మహిళల హక్కులు వర్ధిల్లాలి అంటూ వందలాది మంది మహిళా కార్యకర్తలు రోడ్డు మీద నినాదాలు చేసుకుంటూ తెలుగు సంస్కృతి కార్యాలయం వైపు దూసుకు వెళుతున్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి ముందు వెనుకల బందోబస్తుతో రక్షక భటవర్గం అప్రమత్తంగా కదులుతున్నారు. రోడ్డు కెక్కిన తెలుగు మహిళల విజృంభణ ఏలెవెల్లో ఉండబోతుందో చూడాలనే కుతూహలంతో కొంతమంది కుర్రాళ్ళు మోటారు సైకిళ్ళతో ఆ యాత్రను అనుసరిస్తుంటే, ఆ ఉద్యమంలో పాల్గొనలేని ఆడవాళ్ళు కిటికిల్లోంచి, ఇళ్ళ గుమ్మాల వద్ద నుంచోని చేతులూపుతూ చోద్యం చూస్తున్నారు. ఈ మహిళా మండళ్ళకి పని పాట లేదు. ఆ రచయిత ఏం తప్పు వ్రాశాడని వీళ్ళు రోడ్డెక్కారు. మరీ పల్లదనం కాబోతే, కలికాలం, అని మెటికలు విరుచుకుంటూ కొంత మంది పెద్దవాళ్ళు తెలుగు సీరియల్ టైం అయిపోతుందని గబగబా సర్దుకొని టీవీల ముందు సెటిలవుతారు. రోహిణీకార్తె అవటం మూలంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మండిపోతున్న మార్తాండుడి దెబ్బకు సుకుమారీలైన కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోవటం మొదలైంది. బయల్దేరినపుడు చుట్టు ప్రక్కల ప్రతిధ్వనించిన వారి స్లోగన్లు ఎండలో కొంత దూరం అరుస్తూ నడిచే సరికి గొంతులు పోడారిపోయి వారి స్లోగన్లు వారికే వినబడనట్లు తయారయ్యాయి. భర్తలతో తమ హక్కుల కోసం వీరోచితంగా పోరాడి, కోర్టులకెక్కి, విడాకులు మంజూరు చేయించుకొన్న మహిళాంగనలు, భర్తలు పరలోకవాసులు అయిన తర్వాత, వాళ్ళు ఉన్నప్పుడు తమను పెట్టిన బాధలు గుర్తుకు తెచ్చుకొని, ఆ కష్టం భర్తలున్న ఇతర మహిళా కామ్రేడ్లకు రాకూడదని, ఈ పాదయాత్ర ద్వారా వాళ్ళందరనూ ఉత్తేజపరచ వచ్చునని వచ్చిన వీరాంగనలు కొంతమంది ఆ యాత్ర ముందు