
VENNELLO GODAVARI
₹150
In stock · 22 available
PublisherSAI BABA PUBLICATIONS
LanguageTelugu
వెన్సెలో గోదావరి అప్పుడప్పుడూ నేను సూర్యకిరణాన్ని అయిపోతాను... వెచ్చగా పడుకుని స్వప్నాలలో ఒదిగిపోయిన నీ కనురెప్పలను ఆర్తిగా ముద్దాడి మరీ నిన్ను మేల్కొలుపుతాను. అప్పుడప్పుడూ నేను చిరుగాలినై పోతాను... వస్తూ వస్తూ వనాలు, తోటలు, అడవులు తిరిగి సుగంధాన్నంతా పరిమళంగా నాలో నింపుకుని మరీ నీ చెంతకు వస్తాను నీకు సున్నితంగా వింజామరలు వీస్తూ నిన్ను సేదతీరుస్తాను. అప్పుడప్పుడూ నేను వేకువ కువకువలాడే రాగాన్నైపోతాను... నా ప్రేమను గొంతునిండా నింపుకుని అనురాగ రాగాలు ఆలపిస్తాను అప్పుడప్పుడూ నేను చిగురుటాకును అయిపోతాను... నీతో మాట్లాడుతూ నీ మౌనం నుంచి నిన్ను మేల్కొలుపుతాను అప్పుడప్పుడూ నేను నీహారికా బిందువునై పోతాను... పూలల్లో ఒదిగి, ఆకులపై చేరి కళ్ళనిండా నిన్ను చూసుకుంటూ ఉండిపోతాను అప్పుడప్పుడూ నేను వెన్నెలనై నిన్ను సేదతీరుస్తాను నక్షత్రాల కాంతినవుతాను నీవు నడిచే బాటనవుతాను... మేఘాన్నై వర్షిస్తాను... సెలయేటి పాటనవుతాను.... పదమై కవితనై రాగమై పాటనై ఇంకా ఇంకా ఎన్నో అయి చివరకు నీలోనే కరిగిపోతాను... నా అస్థిత్వం నువ్వు నా చివరి మజిలీ కూడా నువ్వే...