
VENUGANAM - 50
by DR.MALLEMALA VENUGOPAL REDDY
₹50
In stock · 5 available
PublisherDR.MALLEMALA VENUGOPAL REDDY
LanguageTelugu
ప్రచురణ కర్త నివేదిక కవితాభిమానులు, సాహితీ సహృదయులందరికీ శుభస్వాగతం ! ఈ 'వేణుగానం' కవితాకావ్యాన్ని చదువబోయే ముందుగా ఓ చిన్నమాట. ఎలక్ట్రానిక్ మీడియా తెచ్చిన సాంకేతిక దృశ్య విప్లవంతో పుస్తక ప్రచురణ అనేది కత్తిమీది సాములా తయారైందన్నది వాస్తవం. అయితే... 'ఉత్తమ సాహిత్య మెప్పుడూ అజ్ఞాతంగా ఉండిపోదనీ, / మంచి రచనలకి పాఠకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందన్న ప్రగాఢ ఆత్మవిశ్వాసంతో ప్రచురణ రంగంలోకి ప్రవేశించి దిగ్విజయంగా ముందుకు సాగుతున్న మా 'జయంతి పబ్లికేషన్స్' ద్వారా విడుదలవుతున్న మరో సాహితీముత్యమే ఈ ' వేణుగానం' కవితాసంపుటి. సాహితీ క్షేత్రాన్నే నమ్ముకుని, క్షరంకాని అక్షరాల విత్తనాలను చల్లుతూ, రేపటి తరానికి పుస్తకాల పంటను అందించి, సాహితీజగత్తుని వైవిధ్య భరితమైన మంచి రచనలతో సుసంపన్నం చేయాలన్న ఆశయంతో... అక్షరసేద్యం చేస్తూ కొనసాగుతోంది- మా (మీ) 'జయంతి పబ్లికేషన్స్.' ఇటీవలికాలంలో ప్రచురణ రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ-సాహిత్యాభిమానుల్లో ఓ నూతనోత్తేజాన్నీ- రచయితల్లో, పాఠకుల్లో ఉత్సాహపూరిత స్ఫూర్తినీ కలిగిస్తూ విజయపథంలో పయనిస్తున్న 'జయంతి పబ్లికేషన్స్' కృషీ, ప్రస్థానాల గురించి సాహితీ పరిశీలకులందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో... రచయితలంతా రచనావ్యాసంగాన్ని ఓ యజ్ఞంలా భావించి, తమ మెదళ్ళకు పదునుపెట్టి సృజనకు పూనుకుంటే- ప్రచురణ కర్తలుగా మేము వారి సృజనని పాఠకుల ముంగిళ్ళలోకి తీసుకెళ్లేందుకు వాటికి పుస్తకరూపాన్నిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుపడానికి సంతోషిస్తున్నాను. తన మదిలో మెదిలిన భావాలనూ, ఉద్వేగాలనూ అక్షరీకరించి పాఠకులకు తాను చెప్పాలనుకున్న అంశాన్ని, అందించాలనుకున్న సందేశాన్ని తనదైన శైలిలో చక్కటి కవితలుగా మలచి రచించిన ఈ 'వేణుగానం' ఒక సంపుటిగా మా సంస్థ ద్వారా విడుదల కావడానికి కారణభూతులైన ఈ పుస్తక కర్త, ప్రముఖ రచయిత, సాహితీవేత్త 'డా॥ మల్లెమాల వేణుగోపాలరెడ్డి' గారికి, ఈ కవిత్వ ప్రాంగణానికి 'అక్షర తోరణాలు'గా ముందుమాటలు అందించిన ప్రముఖులు డా|| రాధేయ, డా॥ ఆర్. అనంత పద్మనాభరావుగార్లకు మా ధన్యవాదాలు.