VENUGOPALA SATHAKAM by POLIPEDDI VENKTARAYLA KAVI Telugu book cover

VENUGOPALA SATHAKAM

by POLIPEDDI VENKTARAYLA KAVI

₹300
In stock · 6 available
PublisherT.V.SUBBA RAO
LanguageTelugu
వేణుగోపాల శతకము ఈ శతకకర్తృత్వమునుగూర్చి విమర్శకులు భిన్నాభిప్రాయములు వెలువరించియున్నారు. క్రీ.శ. 1800-1875 ప్రాంతమున జీవించిన లావణ్యశతక కర్త పోలిపెద్ది వేంకటరాయకవియే వేణుగోపాల శతకమును కూడ రచించెనని కొందఱు చెప్పగా వింటిననియు, నందులకు సాక్ష్యములేదనియు నిడుదవోలు వేంకటరావుగారు శతకవాఙ్మయచరిత్ర అనుబంధమునందు వివరించిరి. పోలిపెద్ది వేంకటరాయకవి తిట్లదండకమునందు వేణుగోపాలుడు తనకిష్టదైవమని వివరించెను. వేణుగోపాలునిపై రచింపబడిన శతకము పోలిపెద్ది వేంకటరాయ కృతమని భావించుట కీ కారణములే ఆధారములు. కార్వేటి నగరాధీశ్వరుడగు పెరుమాళాజేంద్రుని ఆస్థానమునగల ఒకానొక అధికారి కవిని అనాదరించె ననియు, తత్కారణమున సంస్థానమునందలి ఆక్రమములను, సాంఘిక వ్యవస్థలోని కల్లోలపరిస్థితిని కవి నిశితముగ విమర్శించెననియు, ప్రతీతి. ఈ శతకమున రాజునుగాని, తన నవమానించిన మంత్రినిగాని, ఇతరాధికారులనుగాని కవి పేర్కొనలేదు. కలియుగధర్మముల ననుసరించి సంఘమునందేర్పడిన స్థితిగతులను కవి వివరించుట వలన దురాచారములు మున్నగునవి యుగధర్మ ప్రభావమున గలిగినవని కవి భావించెనని స్పష్టమగుచున్నది. "అహహ కలియుగ ధర్మమేమనఁగ వచ్చు నన్నిటికి నోర్చి యూరక యుండవలెను" నని సమకాలిక స్థితిగతులను సమీక్షించి బాధనొందెను. రాజులు రాజ్యపాలనమునందాసక్తి వహింపక భోగలాలసులై వ్యసనాసక్తులై యుండిరి. వారిలో సాహసపరాక్రమము అంతరించినవి. వారి సేనయు పరాక్రమ విహీనమైనదని కవి ఒక పద్యములో స్పష్టమొనర్చి 'వీరగుణము లేని భటులకు ఆయుధము లేల' అని అధిక్షేపించెను.