VIBHAJANADISALO IRAQ by GUDAVALLI NAGESWARA RAO Telugu book cover

VIBHAJANADISALO IRAQ

by GUDAVALLI NAGESWARA RAO

₹25
In stock · 361 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
విభజన దిశలో ఇరాక్ ఇరాక్ మధ్య ప్రాచ్యంలోని ఒక అరబ్ దేశం, చమురు, సహజ వాయువు సమృద్ధిగావున్న ఇరాక్ లో 2003లో అమెరికా సైనిక జోక్యం చేసుకుని దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేనన్ను గద్దె దింపి, ఖతం చేయటంతో ప్రారంభమైన సంక్షోభం కొనసాగుతూ, యిటీవలికాలంలో మరింత ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నది. ఇరాక్ అంతర్యుద్ధం అంచుకుచేరి, ముక్కచెక్కలయ్యే పరిస్థితి దాపురించింది. దీని ప్రభావం అరబ్ ప్రపంచంమీద, ఇతర ప్రపంచంమీద, ప్రధానంగా భారతదేశంపై పడే ప్రమాదం వచ్చింది. అందుకే భారతదేశమే గాకుండా ప్రపంచ దేశాలు కూడా ఇరాక్ పరిణామాలపట్ల ఆసక్తి చూపుతున్నాయి. ఇది అవసరం కూడా. అందువల్ల అరబ్ ప్రపంచాన్ని గురించి క్లుప్తంగానైనా ముచ్చటించుకోవడం సముచితం. అరబ్ ప్రపంచం - దాని ప్రాముఖ్యత ఇటీవలి ముఖ్య పరిణామాలు ప్రపంచంలో 40 కి పైగా ముస్లిం దేశాలున్నాయి. వాటిలో 23 అరబ్ దేశాలున్నాయి. వీటిని కలిపి అరబ్ ప్రపంచం అని పిలుస్తారు. వీటిలో లెబనాన్, పాలస్తీనాలు మినహా మిగిలిన దేశాలన్నీ చమురు, సహజవాయువు నిక్షేపాలకు ప్రసిద్ధి చెందినవే.