
VIBHINNA DRUSTITHO JEEVANA DARSHANAM
₹125
In stock · 9 available
PublisherSWAMI SUKHABODHANANADA
LanguageTelugu
ముందుమాట మనిషి నూతన జీవిగా మారే ప్రక్రియను ఈ పుస్తకం తెలియచేస్తుంది. ఆత్మను కల్మషమైన మనసు చంపివేస్తుంది. మంచిమనసు ఉన్నతాత్మ (Higher self) వైపు మనలను నడిపించి జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది. మంచి మనసుతో ఉండడానికి నిమ్నాత్మ (Lower self)ను, స్వార్థాన్ని మనిషి వదలిపెట్టాలి. జీవితంలోని భ్రమలను పోగొట్టుకొనటానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది. అప్పుడు మనిషి మృత్యువుకు భయపడడు. జీవితం నిరంతరం ఆహ్వానాన్ని పలుకుతున్నట్లు భావిస్తాడు. ఈ పుస్తకంలోని విషయాలు అన్నీ అర్థం చేసుకొన్నవారికి మనిషి ఉన్నతాత్మే (Higher self) భగవంతుడు అవుతుంది. నూతన కేంద్రం సృష్టింపబడుతుంది, నూతన పద్ధతి పుడుతుంది. మనిషి గర్వాన్ని అణచుకొని స్థిమితంగా ఉండగలడు. జీవితాద్భుతాలను తెలుసుకొనే ఇంద్రజాలాన్ని ఈ పుస్తకం మీకు నేర్పుతుంది. ఆలోచన, ఆలోచించడాలు మనసును మూసివేస్తాయి. ఆలోచన లేకుండా, ఆలోచించకుండా ఉంటే మీ మనసు తెరచుకుంటుంది. ఈ పుస్తకం జీవితాన్ని కొత్తగా చూడడం మీకు నేర్పుతుంది. స్వాతంత్ర్యం అంటే బంధనాలు లేకపోవడం కాదని, బంధనాలుండడం కూడా అని అర్థం చేసుకొనడానికి తోడ్పడుతుంది. బంధించబడేందుకు మీకు స్వేచ్ఛ ఉంది, కనుక ఆ బంధనం మిమ్మల్ని బంధించినట్లు కాదు. మీలో మీకు 'ఆంతరిక ప్రదేశం’ (Inner space) కనిపిస్తుంది. దానిని ఏ బంధనమూ బంధించలేదు. 'మీరు' లేనపుడు ఈ అద్భుతం జరుగుతుంది. ఆత్మ సమర్పణ చేయగల శక్తి మీ 'ఆంతరిక శ్వాస'గా మారుతుంది. ప్రతిక్షణంలో మీరు పూర్తిగా లీనమవుతారు.