VIBHINNA KATHALU - K.V.NARENDAR by K.V.NARENDAR Telugu book cover

VIBHINNA KATHALU - K.V.NARENDAR

by K.V.NARENDAR

₹75
In stock · 9 available
PublisherK.V.NARENDAR
LanguageTelugu
ప్రయోజనంగానే కాదు.. పాత్రల్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే నరేందర్ కి కథా రహస్యం తెల్సు.. ఇది నిజం..! అక్షరాల్ని అన్నం ముద్ద చేసే 'అమ్మ'వుతాడు.. సూర్యుణ్ణి కడుపులో మోసుకెళ్ళే ‘నాన్న'వుతాడు.. 'సతి'థి దేవోభవ అంటూ ఆలికి అయిదో స్థానాన్ని కల్పించి, 'నాతి చెరామి' అంటూ నినదిస్తాడు.. కలాన్ని భుజాన మోస్తూ 'బురదలో జాబిల్ల'యి మొలకెత్తుతాడు.. 'కథ'నరంగంలో సైనికుల పక్షాన నిలిచే యుద్దమవుతాడు.. శిథిలస్వర్గమైన 'ఊరు' సందుల్లో మాయమై పోయిన పల్లెతనం కోసం చంటి పిల్లాడై తిరుగుతుంటాడు.. వెన్నెల్ని జేబులో నింపుకొని 'సిటీ' రోడ్ల వెంట తిరుగుతూ, మానవత్వం కోసం మంచులా కరిగిపోతుంటాడు.. పైకి పూలతోటలా కథలు కనిపించినా, లోలోపల పాత్రలన్నీ నిప్పు సెగలై కాలిపోతుంటాయి.. ఒక వెంట్రుక... బర్రె... చీపురు... బొంతపురుగు కూడా కథా కిరీటాలవుతాయి, పాఠకున్ని మాత్రమే శిరసునెత్తుకొని పరిమళిస్తుంటాయి.. ఏ జెండా కింద ఒదిగి జైకొట్టని.. నరేందర్ కథ పాఠకుడికి మాత్రమే పాదాభివందనం చేస్తుంది. ໑໖ ໖໐..! కథారహస్యం తెలిసిన వాడు నరేందర్..!