VIDHI RUPAKALPANA by KAMALESH PATEL Telugu book cover

VIDHI RUPAKALPANA

by KAMALESH PATEL

₹249
In stock · 1 available
PublisherWESTLAND BOOKS
LanguageTelugu
ISBN9789388689595
మన జీవన గమనంలో విధి అంటే ఏమిటి? ఏది స్థిరమైనది, ఏది మారదగినది? మన విధిని మనం ఎలా రూపకల్పన చేసుకోగలం? ప్రాచీన కాలం నుండి ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తలు అడిగిన ప్రశ్నలివి. వాటిని, అటువంటి ఇతర ప్రశ్నలనూ విశ్లేషించి, వాటికి ఆచరణాత్మక జ్ఞానంతో కూడిన సరళమైన పరిష్కారాలను ఈ వినూత్న గ్రంథంలో దాజీ మనకు అందించారు. "ది హార్ట్ఫుల్నెస్ వే" తర్వాత హార్ట్ ఫుల్నెస్ సాధన విధానం ద్వారా మన ప్రస్తుత జీవన విధానాన్ని సంస్కరించుకోవడానికి, జీవితానంతరం కూడా మన విధిని మనమే రూపకల్పన చేసుకోవడానికి, ఈ యాత్రలో మనకు దాజీ మార్గదర్శకత్వం వహిస్తున్నారు. చైతన్యం గురించి మరింత విపులంగా వివరిస్తూ, పరిణామం పోషించే పాత్రను గురించి, పుట్టుక, మరణ కాలాలలో ఏమి జరుగుతుందో వివరించడమే కాకుండా, జీవితాన్ని మలుపు త్రిప్పే అటువంటి కీలక క్షణాలలో మనం ఎలా ప్రతిస్పందించగలమో కూడా వివరించారు. మనపై మనం నమ్మకం కలిగియుండి, అత్యంత క్లిష్ట పరిస్థితులను, ఎటువంటి సవాలునైనా మన అభివృద్ధికి ఒక అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం గురించి దాజీ మనల్ని ప్రోత్సహించారు. హృదయపూర్వకమైన ఉత్సాహం, విశాల చైతన్య దృక్పథం కలిగి, కొన్ని సరళమైన సాధనా విధానాల ద్వారా మనమందరమూ మన శక్తి సామర్థ్యాలను తెలుసుకుని, మన పుట్టుక యొక్క పరమార్థాన్ని నెరవేర్చగలమని దాజీ చ ఉద్ఘాటించారు.