
VIDHI VANCHITHUDU
by GUDURU GOPALA KRISHNAMURTHY
₹100
In stock · 18 available
PublisherGUDURU GOPALA KRISHNAMURTHY
LanguageTelugu
మానవ జీవితం క్షణకాలంలో విచ్చన్నమైన నీటి బుడగలాంటిది. ఆక్షణికమైన జీవితంలోనే ఎన్నో అనుభూతులు, భావ మనోవికారాలు, కష్టాలు, కన్నీళ్ళు, సంఘర్షణలు. అటువంటి జీవితంలో కూడా సాహిత్యం మీద అభిరుచి పెంచుకుని, సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ ఉత్తమ సాహిత్యం కోసం పరితపిస్తున్న వాళ్ళు కొందరయితే, దాన్నే కాలక్షేపం బఠాణీలుగా భావించి ఆస్వాదించినవాళ్ళు మరికొందరు. నేను చేస్తున్న ఈ చిన్న సాహిత్య సేవలో నేను సామాజిక సమస్యలకి ప్రాధాన్యం ఇచ్చాను, ఆ సమస్యలకి పరిష్కారం చూపలేకపోయినా ఆవేదనగా నిట్టూర్పు విడిచాను. ఆ సమస్యలకి పరిష్కారం ఏదో ఒకరోజున లభిస్తుందని ఆశాజీవిగా ఆశిస్తూ నేను ఈ కథానికలు, కథలు వ్రాసాను. వాటిని ప్రోత్సహించిన వివిధ పత్రికా సంపాదకులకి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ముఖ్యంగా శు భం ఆధ్యాత్మిక పత్రిక సంపాదకులు రాఘవమ్మగారికి, భక్తి సమాచార్ సంపాదకులు సముద్రాల నాగరాజు గారికి, జనవార్త ఈవారం సంపాదకులు సత్యన్నారాయణ గారికి, శస్త్రీయం మాసపత్రిక సంపాదకులు వి. శ్రీనివాసుగారికి, చైతన్యం పత్రికా సంపాదకురాలు శాంతిగారికి, సాహితీ స్రవంతి ప్రజాశక్తి (స్నేహ) సంపాదకులకి, ఆంద్రభూమి జిల్లా ఎడిషన్ లో 'మెరుపు' లో నా రచనలు ప్రచురించిన ఆంధ్రభూమి పత్రికా సంపాదకులకి, జయశ్రీ మాస పత్రికకి, విప్రవాణి సంపాదకులు డా॥ శ్రీకాంత్ గారికి, సాహితీ కిరణం సంపాదకులకి నాకృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా ఈ రచనా వ్యాసాంగాన్ని ప్రోత్సహించిన సాహిత్య మిత్రులు లక్ష్మణరావు, బులుసు జియప్రకాష్, రఘునందన్, దూరివెంకటరావు,మహబాష్యం నరిసింహరావు, యస్.యస్.యస్.యస్. రాజుగారికి, చీకటి దివాకర్ గారికి, చాగంటి తులసి గారికి, మిగతా నా మిత్రులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా రచనలలో, నా అబిప్రాయలలో ఏమైనా తప్పులు దొర్లినట్లయితే సాహితీ మిత్రులు క్షమిస్తారని ఆశిస్తున్నాను. విమర్శకులు వాటిని తెలియజేస్తూ నా సాహిత్య సేవలో సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను.