
VIDWESHAPU VISWAGURU
by N VENUGOPAL
₹250
In stock · 6 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076350
Vidweshapu Viswaguru అందరికీ తెలిసిన వామపక్ష జర్నలిస్టు, సాహసోపేతమైన రచయిత, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ తాను 'వీక్షణం'లో రాసిన సంపాదకీయాలతో ఈ 'విద్వేషపు విశ్వగురు' పుస్తకం తెస్తున్నారు. ఆయన కలం చాలా పదునైనది. పుస్తకం పేరులోనే ఎవరి గురించి రాసారో అర్థమౌతుంది. ఆర్ ఎస్ ఎస్ రాజకీయ విభాగమైన భారతీయ జనతాపార్టీ నరేంద్ర మోడీ నాయకత్వాన గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల, మతోన్మాద విద్వేష పాలన సాగిస్తున్నది. భిన్న సంస్కృతుల భారతదేశాన్ని కకావికలు చేసింది. భారత ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నది. శ్రామికవర్గం పోరాటాల ద్వారా సాధించిన సంక్షేమ చట్టాలను కాలరాస్తున్నది. ముస్లిం మైనారిటీల మీద నిరంతర దాడులు చేస్తున్నది. రాజ్యాంగబద్ధ సంస్థలను పార్టీ అనుబంధ సంస్థలుగా మారుస్తున్నది. పౌరహక్కులను కాలరాస్తున్నది. మేధావులను వేధిస్తూ, తప్పుడు కేసులలో సంవత్సరాల తరబడి జైళ్లలో బంధిస్తూ ఫాసిస్టు పాలన సాగిస్తున్నది. న్యాయవ్యవస్థను కూడ నిర్వీర్యం చేస్తున్నది. ఈ దుర్మార్గ పాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టిన, విశాల ఐక్యతతో ప్రతిఘటించాలని ప్రజాచైతన్యాన్ని హెచ్చరించిన సంపాదకీయాలు ఇక్కడ ఒక్కచోటికి వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం ఇది. -సురవరం సుధాకర్ రెడ్డి విద్వేషపు 'విశ్వగురు' పేరుతో ప్రధాని మోదీ పాలనపై జర్నలిస్ట్ మిత్రుడు ఎన్ వేణుగోపాల్ సంపాదకీయాలను సంకలనం చేయడం, మలుపు బుక్స్ అచ్చు వేయడం నిజంగా అవసరమైన సాహసం. తూర్పున సూర్యుడు ఉదయించును అని లిఖిస్తే కేసులు పెట్టే కాలంలో విద్వేష రాజకీయాలను, సామ్రాజ్యవాద అనుకూల ఆర్థిక విధానాలను ఉన్నది ఉన్నట్లుగా తూర్పారబడుతూ పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాయడం వాటిని అచ్చేయడం ఏటికి ఎదురీదడమే. పాలకులు సూట్కేసులు, బ్రీఫ్ కేసులు విదేశీ బ్యాంకులకు తరలిస్తుంటే దాన్ని చిత్రించినా, లిఖించినా ఊపా కేసులు వేధిస్తున్నాయి. అయినా, నిర్భయంగా సత్యాలను వెల్లడిస్తున్న ఈ పుస్తకాన్ని చదవవలసిందిగా పాఠకులను కోరుతున్నాను.