VIDYAAVARANAM by DR.DWANA SASTRY, DR.B.SATYANARAYANA Telugu book cover

VIDYAAVARANAM

by DR.DWANA SASTRY, DR.B.SATYANARAYANA

₹30
In stock · 39 available
PublisherSURYA PRACHURANALU
LanguageTelugu
మా మాట మేమిద్దరం గురుశిష్యులం! ద్వానా గురువైతే బండి శిష్యుడు! గురువంటే శిష్యుడికి అమిత గౌరవం! శిష్యుడంటే గురువుకి అత్యంత ఆదరం! 'విద్యారంగం'పై ఎప్పటి నుంచో ఎవరైనా దీర్ఘకవిత రాయాలన్నది గురువుగారి కోరిక! ఎవరో ఎందుకు మీరే రాయొచ్చుగా అన్నది శిష్యుడిమాట! వెంటనే గురువుగారు - జంటగా రాద్దామన్నారు. 'సరే' అనకుండా శిష్యుడు ఉండగలడా! అదొక భాగ్యంకదా! అలా విద్యారంగంపై గురుశిష్యుల జంటకవిత్వంగా వచన కవితా రంగంలో విశిష్ట ప్రయోగంగా వెలువడిందీ కవిత! ఇందులో ఎవరు ఏం రాశారు? అన్న ప్రశ్న కంటే మా తపన, మా వేదనలను అర్ధం చేసుకోమనవి. మన చదువులు చట్టుబండలు కాకూడదని కోరుకుంటున్నాం