
VIGNANA PATHAMLO VIJAYA GHATTALU - 100.00
₹100
In stock · 402 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
డాక్టర్ దేవరాజు మహారాజు సమకాలీన తెలుగు సాహిత్య రంగంలో తనదైన 'రాజముద్ర' వేసుకున్న సుప్రసిద్ధ సాహితీవేత్త. కవిగా, కథా రచయితగా, నాటకకర్తగా, అనువాదకుడిగా, కాలమిస్ట్గా యాభై ఏళ్ళుగా నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నారు. అట్లని ఆయన తన చదువును వృధా కానివ్వలేదు. జువాలజీ ప్రొఫెసర్గా వృత్తి చేపట్టినా, నెమటోడ్ వృక్ష పరాన్నజీవుల మీద పరిశోధనలు చేసినా, చేయించినా, సరళ విజ్ఞాన శాస్త్ర రచనలు సాగిస్తూనే ఉన్నారు. మూఢనమ్మకాల నిర్మూలనకు కలం కొరడా ఝుళిపిస్తూనే ఉన్నారు. తెలుగు అకాడమీకి రచయితగా, సంపాదకుడిగా సహకరించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ - న్యూఢిల్లీ వారికి సలహా సంఘ సభ్యులుగా ఉండేవారు. ప్రాంతీయ స్థాయి నుండి జాతీయ స్థాయి దాకా ఎన్నోసార్లు ఎన్నో సాహిత్య అవార్డులకు జ్యూరీ మెంబరు. పుట్టింది 21 ఫిబ్రవరి 1951 కోడూరు గ్రామం, వరంగల్ జిల్లా. బాల్యం గడిచింది చాడ గ్రామం, నల్లగొండ జిల్లా. ఉన్నత విద్య సభ్యసించింది న్యూ సైన్స్ కాలేజి, పి.జి. సెంటర్, వరంగల్; ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో - 1975లో ఎమ్మెస్సీ డిగ్రీ ప్రథమ శ్రేణిలో తీసుకుని, ICAR న్యూఢిల్లీ వారి ఫెలోషిప్తో 1979లో పిహెచ్.డి. చేశారు. పరిశోధన పత్రాలెన్నో అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురించారు. ద హిందూ, డక్కన్ క్రానికల్ వంటి ఇంగ్లీషు దినపత్రికలలో సైన్స్ వ్యాసాలు రాశారు. బాధ్యతెరిగిన రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి డా॥ దేవరాజు మహారాజు. ‘మూఢనమ్మకాలు-సైన్స్', 'ఎయిడ్స్' వంటి వీరి పుస్తకాల్ని లోగడ విశాలాంధ్ర ప్రచురణాలయం ముద్రించింది. అవి పునర్ముద్రణలు కూడా పొందాయి. కొంతకాలం వీరు ప్రచురణాలయానికి సైన్స్ ఎడిటర్గా కూడా ఉన్నారు. 'భారతీయ భాషల్లో స్త్రీవాద కథలు', 'భారతీయ కథా ప్రతిబింబం', 'కొన్ని కలాలు-కొన్ని సమయాలు' వంటి వీరి గ్రంథాల్ని లోగడ విశాలాంధ్ర ప్రచురించింది. మానవ జీవనయానం ఎలా సాగుతూ వచ్చిందో ఆసక్తికరంగా తెలియజేసిన 'విజ్ఞాన పథంలో విజయ ఘట్టాలు' అనే ఈ పుస్తకాన్ని ఇప్పుడు పాఠకులకు అందిస్తోంది.