VIGNANA SASTRA VINODALU by K.V.S.GNANESWAR RAO Telugu book cover

VIGNANA SASTRA VINODALU

by K.V.S.GNANESWAR RAO

₹35
In stock · 203 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఖగోళశాస్త్రం మీ చేతి గడియారమే ఒక దిక్సూచి ఎండ కాసే రోజున మీ చేతి గడియారాన్ని దిక్సూచిగా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? మీ చేతికున్న గడియారాన్ని చూడండి. గడియారంలోని గంటల ముల్లు, పటంలోలాగా, సూర్యునివైపు చూపించేటట్లు చేయి వుంచండి. ఇప్పుడు గడియారం కేంద్రం నుండి గంటల ముల్లుకు, ఒకటి అంకెకు సరిగ్గా మధ్యలో ఒక రేఖ వెళ్తందని ఊహించండి. ఈ రేఖ దక్షిణ దిక్కును సూచిస్తుంది. మీకు కొద్దిగా ఖగోళశాస్త్రం గురించి తెలిసివుంటే, ఇది ఎందుకో అర్ధమౌతుంది. భూమి ఉత్తరార్ధ గోళంలో మధ్యాహ్న వేళ సూర్యుడు దక్షిణ దిక్కులో ఉంటాడు. మన దేశంలో నిజమైన మధ్యాహ్న కాలం ఒంటిగంట. ఆ సమయంలో మనం గంటల ముల్లును సూర్యునివైపుగా ఉంచితే, ఆ ముల్లూ, ఒకటి అంకె దక్షిణంవైపు ఉంటాయి. అందువల్లనే మీరు గంటల ముల్లుకు ఒకటి అంకెకు సరిగ్గా మధ్యలో గడియారం కేంద్ర బిందువు నుండి పోయే ఒక గీతను ఊహించాలి. అది దక్షిణ దిక్కును సూచిస్తుంది. మీరు దక్షిణార్ధగోళంలో వున్నట్లయితే, 12 అంకెను సూర్యునివైపు ఉంచాలి. (ఈ అంకెకూ, గంటల ముల్లుకూ మధ్య కోణం అప్పుడు ఉత్తరదిక్కును చూపిస్తుంది) పన్నెండు అంకెకూ, గంటల ముల్లుకూ సరిగ్గా మధ్యలో వెడుతున్నట్లు మీరు ఊహించే రేఖ ఉత్తరదిక్కును చూపిస్తుంది. గుండు అట్టపెట్టెతో ఖగోళ ప్రదర్శనశాల గొట్టంలావున్న గుండు అట్ట పెట్టెతో మీరొక ఖగోళ ప్రదర్శనశాలను (Planetarium) తయారుచేయవచ్చు. ఆ పెట్టె అందమైన నక్షత్రాల బొమ్మను గోడపైన చూపిస్తుంది. ఒక ఖగోళశాస్త్ర పుస్తకాన్ని తీసుకుని, మీరు పరిశీలించదలచిన నక్షత్రాల గుంపును ఒక కాగితంపై గుర్తించండి. పెట్టె వెలుపలి అడుగు భాగంపై మీ బొమ్మను బోర్లించి అతికించండి. ఒక మేకుతో ప్రతి నక్షత్రం గుర్తుపైనా పెట్టెలోకి రంధ్రాలు