VIGNANA VEECHIKALU - SUNDAY MARKET CALENDARLU by VIGNANA PRACHURANALU Telugu book cover

VIGNANA VEECHIKALU - SUNDAY MARKET CALENDARLU

by VIGNANA PRACHURANALU

₹250
In stock · 27 available
PublisherVIGNANA PRACHURANALU
LanguageTelugu
విద్య - వైద్యం - ఆరోగ్యం - ఆహారం పర్యావరణం - చరిత్ర - సైన్స్ - సినిమా లౌకికవాదం - కరోనా నమ్మకాలు నిజాలు విజ్ఞాన వీచికలు ఈ సండేమార్కెట్ కాలెండర్లు ఎంతో చైతన్యవంతంగా విలువలను పాటిస్తూ, సామాజిక బాధ్యతతో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ముందుకు సాగడంలో సండేమార్కెట్ సంఘం ఒక కొత్త చరిత్రను సృష్టించిందని నాకు చాలా ఆనందం కలిగింది. - కె. రాజు, IAS నెల్లూరు జిల్లా విశ్రాంత కలెక్టరు 2010లో సండే మార్కెట్ ప్రయత్నంగా ప్రయోజనకరమైన సమాచారాన్ని ఇచ్చే క్యాలెండర్లు ప్రతి సంవత్సరం విభిన్నమైన అంశంతో, సంబంధిత బొమ్మలతో రావడం తెలుగు నాట ఒక అర్థవంతమైన, ఆరోగ్యకరమైన పరిణామం. - నాగసూరి వేణుగోపాల్, ప్రముఖ రచయిత, ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు నిజానికి ఈ క్యాలెండర్ ఆవిష్కరణల్లో ఈ సంస్థ ఒక విభిన్నమైన కోణాన్ని స్పృశించింది. నిరంతరం కళ్ళ ముందు రెపరెపలాడుతూ కాలాన్ని శాసిస్తున్నట్లు కనపడే పడే ఈ గోడ మీద క్యాలెండర్ అవకాశం దొరికినప్పుడల్లా తన వైపు చూడమంటుంది. - వి.విజయకుమార్, విశ్రాంత ఉపాధ్యాయులు బాల్యమన్న అద్భుతాన్ని, దాని సృజనాత్మక స్వేచ్ఛా వికాసానికి దోహదం చేసే విద్యా వైజ్ఞానిక ఆలోచనలను ఈ కేలండర్ ద్వారా మనం పొందగలం. ఒక విద్యా సంస్థ నిర్వహించవలసిన కర్తవ్యాన్ని సండే మార్కెట్ వారు చేపట్టి సఫలీకృతులు కావడం ఒక గొప్ప విశేషం. -బి.సూర్య సాగర్, విశ్రాంత వృక్షశాస్త్ర ఆచార్యులు, రచయిత పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు విద్యావేత్తల గురించి ఇచ్చిన సమాచారం, ప్రముఖుల సూక్తులు నిడివిలో అతి చిన్నవైనప్పటికీ ప్రస్తుత సాంప్రదాయక విద్యా విధానానికి ప్రత్యామ్నాయాలను ఈ క్యాలెండర్ సమగ్రంగా చూపెట్టింది. జిలాని, ఎడిటర్ 'ఉపాధ్యాయ' మాసపత్రిక ప్రతి పేజిలోనూ, పేజిలోని ప్రతి ఇంచి స్థలంలోనూ సమాచారాన్ని దట్టించి విజ్ఞానాన్ని అందించే థీమ్ కాలెండర్లు సండే మార్కెట్ కాలెండర్లు. - బాలాజీ, సైన్స్ ఉద్యమ కార్యకర్త, కోల్కతా బోధన, సామాజిక రంగాలలో ఉండే వారికి సండే మార్కెట్ క్యాలెండర్ ఒక రిఫరెన్స్. సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహించే వారికి ఒక హ్యాండ్ బుక్. కవులు రచయితలకు ఒక దిక్సూచి. విద్యార్థులకు ఒక మార్గదర్శి. చావలి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, శ్రీకాకుళం ఈ సండే మార్కెట్ క్యాలెండర్లు విశేష ఆదరణ పొందాయి. విజ్ఞాన సంపదగా ఆకట్టుకున్నాయి. తెలుగు నేల మీద వేలాది మెదళ్లను తమ సంపదగా సొంతం చేసుకునే ప్రయత్నం జరిగింది. ఈతకోట సుబ్బారావు, సీనియర్ జర్నలిస్టు, నెల్లూరు