VIGNANA VINODINI by VISWANATH JOSHI Telugu book cover

VIGNANA VINODINI

by VISWANATH JOSHI

₹120
In stock · 9 available
PublisherVISWANATH JOSHI
LanguageTelugu
వినోదంతో విజ్ఞానం మిత్రులు విశ్వనాథ జోషి విజ్ఞాన విశ్వవిహారి - విజ్ఞానాన్ని వినోదంగా కూర్చి, తీర్చి చిన్నారుల నుండి, మేధావుల వరకు అన్ని రంగాలకు చెందిన వారిని ఆహ్లాద పరిచే తీరులో చేయించిన చిత్ర విచిత్రమైన విజ్ఞాన యాత్ర ఇది. విజ్ఞాన పిపాసువులకు మరపు రాని, మరువలేని, లౌకిక, అలౌకిక, భౌతిక, ఆధ్యాత్మిక, ఆలోచనాత్మక, అనుభూతుల విందు ఇది. నిరంతర విద్యార్థిగా, ఆదర్శవంతుడైన అధ్యాపకుడుగా, లాజిక్కు చిక్కని మ్యాజిక్కు రెండు రెక్కలుగా సృజనాత్మక అక్షరాంతరిక్షంలో అద్భుతంగా విహరించాడు. ఈ జోషి ఒక విలక్షణమైన మాటల మాంత్రికుడుగా, చేతల తాంత్రికుడుగా విశ్వవ్యాప్త విజ్ఞానాన్ని విశ్వజనీనంగా, విశ్వసనీయంగా ఆబాలగోపాలానికి అందిస్తున్న ఈ అనిర్వచ నీయ గ్రంథరాజం చదువుతుంటే, అజ్ఞానం కనిపెట్టిన అద్భుత సత్యాలెన్నో! పుస్తకం నామకరణం ఏదైనా, ఇది జిజ్ఞాసువుల పాలిటి “విజ్ఞాన కల్పతరువు”గానే నాకు భాసించింది. నేటి విద్యార్థి లోకానికి, యువతరానికి విజ్ఞాన వినోదపరమైన కోరికలన్నీ తీర్చగలదని విశ్వసిస్తున్నాను. శ్రీ విశ్వనాథ జోషిగారికి ఈ పుస్తక రచనా స్ఫూర్తిని కలిగించిన వారందరిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి నిత్యసత్యాలు, ఆలోచనాత్మక తత్వాలు, సంపుటీకరించిన తీరు యువ తరానికి ఒక వరంగా భావించవచ్చు. మస్తకాలను పదునుపెట్టే ఇలాంటి పుస్తకాలు ఎన్ని వచ్చినా తక్కువే. ఈ కంప్యూటర్ యుగంలో కూడా సగటు మనిషి చైతన్యం కలిగించే విజ్ఞాన పూర్వక వినోదం, నన్ను గిలిగింతలు పెట్టింది. ఈ పుస్తకానికి ఇతోధికమైన స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాను.