VIGNANASASTRA SMARANIYUDU NEWTON by DR.R.RAMAKRISHNA REDDY Telugu book cover

VIGNANASASTRA SMARANIYUDU NEWTON

by DR.R.RAMAKRISHNA REDDY

₹40
In stock · 199 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఊహకందని విజ్ఞానం పదిహేడు, పద్దెనిమిది శతాబ్దాలలో ఎన్నో సరికొత్త విప్లవాలు వెల్లివిరిసాయి. కొత్త కొత్త పరికరాలను కనిపెట్టడం ద్వారా శాస్త్ర ప్రపంచంలో అంతులేని ఆవిష్కరణలు ఆవిర్భవించాయి. దీని ద్వారా శాస్త్ర విప్లవం వెల్లివిరిసింది. ఈ విప్లవ ప్రకంపనలు శిల్పం, సాహిత్యం, చిత్రలేఖనం... ఇలా అన్ని రంగాల్లో ప్రతిఫలించాయి. ప్రపంచాన్ని సరికొత్త దృక్పథంతో చూసే రోజులొచ్చాయి. దీనికి పాలుపోసి పెంచినవాడు న్యూటన్, హేతువు ద్వారా కాంతిమయమైన భావసంపద వృద్ధిచెందే అవకాశాలు తక్కువ. నీలాకాశం నుంచి మెరుపు కీలలుగా ఆ భావాలు మెరిసిపోతుంటాయి. సృజనాత్మక ఊహావైభవం బుద్ధికి సన్నిహితమైంది కాదు. అది అంధశక్తి అయిన సహజాతం కూడా కాదు. అది అంతఃస్ఫూర్తికి సంబంధించినది. హేతువుకన్నా, బుద్ధికన్నా అంతఃస్ఫూర్తి గొప్పది. వైజ్ఞానిక ఆవిష్కరణలు దర్శనానికి చేరువగా ఉండే సృజనాత్మక ఊహనుంచి పుట్టినవే. విజ్ఞానశాస్త్రంలో ఆవిష్కరణలు పరిశోధనారంగాల్లో కాకుండా వింత ప్రదేశాల్లో జరిగాయి. ఆర్కిమెడిస్కు స్నానం చేస్తుండగా భారరహిత స్థితిపై విజ్ఞానసూత్రం తట్టింది. న్యూటన్ తోటలో కూర్చొని ఒక పండు కింద పడుతు న్నప్పుడు భ్యూమాకర్షణ శక్తి ఆయనకు స్ఫురించింది. పెరూ అనే దేశంలో అనారోగ్యస్థితిలో పడకపై ఉండగా ఐన్స్టీన్ు కాలానికి, అంతరాళానికి గల సంబంధం ఏమిటో తెలిసింది. సౌరకుటుంబ చలనాలకు మూలమైన ప్రాథమిక సూత్రాలను, విశ్వవ్యాప్త గురుత్వాకర్షణ సిద్ధాంతాలను, తెల్లటి కాంతిలో, సప్తవర్ణాలున్నాయని, వస్తువు చలన సూత్రాలను, పదార్థ బరువు, ద్రవ్యరాశి వేరువేరని ప్రపంచానికి తెలియజేసినవాడు న్యూటన్. నిత్యం మన కళ్ళముందు జరుగుతున్న సంఘటనలను ఒక క్రమపద్ధతిలో, శాస్త్రీయంగా, గణిత సూత్రాలను జోడించి విశ్వ సూత్రాలను ఆవిష్కరించాడు. తన