
VIGRAHAM VIGNANAMA AGNANAMA
₹100
In stock · 36 available
PublisherP.NAGAGOWTHAM
LanguageTelugu
వైదిక ధర్మం, సనాతన ధర్మం, ఆర్షధర్మం అని పిలవబడే ధర్మమే నేడు 'హిందూ ధర్మం'గా భావించబడుతుంది. వాస్తవానికి దాని అసలు పేరు అది కాదు. ఆ పేరు కారణంగానే అది కేవలం ఒక ప్రత్యేక వర్గపు మతంగా ప్రాచుర్యం పొందింది. వాస్తవానికి ఆ ధర్మం సార్వజ నీనం మరియు సార్వకాలికం. అంటే సర్వజనులకు ఆచరణ యోగ్యమైనది. సర్వకాలాలలోనూ ఆచరణ సాధ్యమైనది. అంతేకాక ప్రపంచంలో అత్యంత సనాతనమైనది అనగా ప్రాచీనమైనది. నిత్యనూతనమైనది. పైగా అత్యధిక ఋషుల, మునుల ఉపదేశాలు కలది. అది ఎంతటి ప్రాసశ్యాన్నీ, వైశిష్ట్యాన్ని కలిగి ఉందో అంతకంటే ఎక్కువ మూఢత్వాన్నీ, అజ్ఞానాన్నీ కలిగి ఉందన్నదికూడా ప్రతీతి! దీని ఈ పరస్పర విరుద్ధ అభిప్రాయాలకు కారణం ఏమిటో నాకు అంతుచిక్కక సతమతమవుతున్న తరుణంలో 'కులము, సంస్కృతి, సామ్యవాదం' మరియు 'నాభారతం అమరభారతం' అనే మకుటాలతో స్వామి వివేకానంద విరచిత పుస్తకాలలోని ఈ క్రింది భాగాలు పైసమస్యకు కారణాన్ని తెలియజేసాయి. "నాకు మ్లేచ్ఛ భోజనమైతేనేం 'హరిజన' భోజనమైతేనేం? కులాది ఉన్మాదాలు కానవచ్చేది మతాచార్య నిర్మిత గ్రంథాల్లో మాత్రమే: ఈశ్వరవాణి రూపగ్రంథాల్లో కాదు. వారి పూర్వీకులు ఆర్జించిపెట్టిన దాన్ని మతాచార్యులు అనుభవిస్తారు గాక; నేను మాత్రం ఈశ్వరవాణినే అనుసరిస్తాను: అదే నాకు శ్రేయస్కరం". -పేజి నెం. 31 "ప్రాచీన భారతదేశంలో బ్రాహ్మణులు, క్షత్రియులు వారి వారి ఆధిపత్యాన్ని సమాజంపై సాధించటానికి పెనుగులాడారు. ఆ పెనుగులాటకై వారు రచించిన పథకాల మార్గంలో ఇరు వర్గాల మధ్య సభవించిన ఘర్షణ శతాబ్దాలుగా దేశాన్ని రణరంగంగా మార్చింది. సామాన్య ప్రజలపై రాజులు చెలాయించే ధర్మరహితమైన క్రూర పరిపాలన, ఆ మధ్యలో కొట్టుమిట్టాడుతున్న బ్రాహ్మణత్వం ఒక ప్రక్క, బ్రాహ్మణులు తమ పరిధిలో క్రతువులు. పూజాది కార్యక్రమాలు వీటి పేరుతో ప్రజలను బంధించి తమ ఆధిపత్యాన్ని నిర్ధాక్షిణ్యంగా సాధించాలనే ఉద్యమం, దానికి ఎదురుగా రాజుల యొక్క శక్తివంతమైన పోరాటం మరొక ప్రక్క చెలరేగాయి".