VIJAYA SOPANALU by P.V.PRASAD Telugu book cover

VIJAYA SOPANALU

by P.V.PRASAD

₹50
In stock · 14 available
PublisherJAYANTHI PUBLICATIONS
LanguageTelugu
సాహిత్యాభిమానులు, సాహితీ సహృదయులందరికీ శుభస్వాగతం. ఈ 'అమ్మ అక్షరాలు-విజయ సోపానాలు' లోకి అడుగిడే ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా తెచ్చిన సాంకేతిక దృశ్యవిప్లవంతో పుస్తక ప్రచురణ అనేది కత్తిమీది సాములా తయారైందన్నది వాస్తవం. అయితే... 'ఉత్తమ సాహిత్యమెప్పుడూ అజ్ఞాతంగా ఉండిపోదనీ, మంచి రచనలకి పాఠకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుం'దన్న ఆత్మవిశ్వాసంతో ప్రచురణ రంగంలోకి ప్రవేశించి గత దశాబ్దకాలం నుంచి దిగ్విజయంగా ముందుకు సాగుతున్న మా 'జయంతి పబ్లికేషన్స్' ద్వారా విడుదలవుతున్న మరో సాహితీముత్యమే... ఈ 'అమ్మ అక్షరాలు- విజయ సోపానాలు' వ్యాస సంపుటి. సాహితీ క్షేత్రాన్నే నమ్ముకుని, క్షరంకాని అక్షరాల విత్తనాలను చల్లుతూ, రేపటి తరానికి పుస్తకాల పంటను అందించి, సాహితీజగత్తుని వైవిధ్యభరితమైన మంచి రచనలతో సుసంపన్నం చేయాలన్న సదాశయంతో.. అక్షర సేద్యం చేస్తూ కొనసాగుతోంది- మా (మీ) 'జయంతి పబ్లికేషన్స్.’ సాహిత్య, ప్రచురణ రంగాలలో నూతన ఒరవడిని సృష్టిస్తూ- పుస్తక ప్రచురణని రచయితలకు మరింత చేరువ చేసి, సాహిత్యాభిమానుల్లో ఓ నూతనోత్తేజాన్నీ-రచయితల్లో, పాఠకుల్లో ఉత్సాహపూరిత స్ఫూర్తినీ కలిగిస్తూ విజయపథంలో పయనిస్తున్న 'జయంతి పబ్లికేషన్స్' కృషీ, ప్రస్థానాల గురించి సాహితీ పరిశీలకులందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో... రచయితలంతా రచనావ్యాసంగాన్ని ఓ యజ్ఞంలా భావించి, తమ మెదళ్ళకు పదును పెట్టి సృజనకు పూనుకుంటే- ప్రచురణ కర్తలుగా మేము వారి సృజనని పాఠకుల ముంగిళ్ళలోకి తీసుకెళ్లేందుకు వాటికి పుస్తకరూపాన్నివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సమాజంలో సగటు మనిషి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే అత్యావశ్యక విషయాలను చక్కటి వ్యాసాలుగా రచించి, వాటన్నింటినీ ఒక సంపుటిగా మలచిన ఈ 'అమ్మ అక్షరాలు-విజయ సోపానాలు' వ్యాసనంపుటి- మా సంస్థ ద్వారా విడుదల కావడానికి కారణభూతురాలైన ఈ పుస్తక కర్త, రచయిత 'శ్రీ పి.వి. ప్రసాద్' గారికి, ఈ సంపుటికి అక్షరతోరణంగా తమ అమూల్యమైన 'ముందుమాట'ని అందించి నిండుదనాన్ని చేకూర్చిన 'శ్రీ పురాణం త్యాగమూర్తి శర్మ'గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.