
VIJAYA VILASAMU - 400
₹400
In stock · 33 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మా మాట "తాతాజీ" తాపీ ధర్మారావుగారి శత జయంతి 1987, సెప్టెంబరు 19 నందర్భంగా వారి "విజయ విలాసము-హృదయోల్లాస వ్యాఖ్య" రెండవ ముద్రణను పాఠకలోకానికి అందించగలుగుతున్నందుకు మా కెంతో ఆనందంగా ఉంది. తనను చిన్న నాటినుండి ఎంతగానో అలరించిన చేమకూర వెంకటకవి "విజయ విలాసము" కావ్యంలోని అందాలను చక్కగా చూపిన వ్యాఖ్యానాలు అంత వరకు వెలువడలేదన్న బాధ ఒకవైపు ఉన్నా, ఆ లోటును తీర్చేందుకు అవసరమైన పాండిత్యం తనకులేదేమో అన్న సంకోచమూ మరొకవైపు తనకు మొదట్లో ఉండేదని ధర్మారావుగారే ఈ "హృదయోల్లాన వ్యాఖ్య" పీఠికలో తెలియజేశారు. ఆ కారణం చేతనే వ్యాఖ్యాన రచనకు చాలకాలం వరకు వారు పూనుకోలేదు. అయినా, వారే పీఠికలో చెప్పినట్లు, తన అభిమాన కవిలో తాను చూడ గలిగిన విశేషాలూ, తాముకొన్న సొగసులూ, తాను వివరించగా మిత్రులు హర్షించిన అందాలూ-ఇవన్నీ ఏమి కావాలి, ఆ అందచందాలు పాఠకలోకానికి అందకుండా మరుగునపడి ఉండవలసిందేనా అన్న మధన వారిలో అంతకంతకు ప్రకటించింది. చివరకు వ్యాఖ్యాన రచనకు పూనుకున్నారు. అలా "కవికిన్ గల్గునో కల్గదో ర్థ విశేషంబులు చేమకూర కవి యనెడి శంకన్ గల్గజేయు న పద్యాలందు చూపించినా వవురా: మెచ్చితి మామకాగమన వార్తాఖ్య స్థలంబందు నీ వివృతిం, బొందితి నీదు చాతురికి తాపి వంశ మూక్తాన కాశీ" అని కీర్తి శేషులు శతావధాన శిరోమణి బ్రహ్మశ్రీ కాశీకృష్ణా చార్యులంతటివారే సంతోషంతో పొంగిపోయేలాంటి వ్యాఖ్యానాన్ని పాఠక లోకానికి అందజేశారు. ఇది ఒక మనోజ్ఞమైన కావ్యానికి, అంతటి మనోజ్ఞమైన వ్యాఖ్యానం మాత్రమేకాదు. ఆధునికులు ప్రాచీన కావ్యాలను ఎలా చదవాలో, వాటిలోని సొగ సులను ఎలా గ్రహించాలో పాఠకులకు బోధించే ఒక ఉపకరణం లాంటిది. ఈ "హృదయోల్లాన వ్యాఖ్య". ప్రముఖ సాహితీ వేత్త, విమర్శకులు అయిన కీ॥ శే॥ జి. వి. కృష్ణారావుగారి మాటల్లో "చరిత్ర, చమత్కారం, తెలుగు పలుకుబడి ఆపోశనం పట్టిన తాపీవారి వ్యాఖ్య" ఇది. (ఆంధ్ర ప్రభ, 1968 డిసెంబరు 15),