VIJAYAPADHAGARJANA by SWAMI SUKHABODHANANDA Telugu book cover

VIJAYAPADHAGARJANA

by SWAMI SUKHABODHANANDA

₹125
In stock · 4 available
PublisherSWAMI SUKHABODHANANDA
LanguageTelugu
స్వామి సుఖబోధానందగారి మాటల్లో... చక్రం పంక్చర్ అయి కారు ఆగిపోయినపుడు దాన్ని గురించి చికాకుపడితే అది సరిపోదుకదా? అలాగే జీవితం గురించి కూడా విసుక్కుంటూ, చికాకు పడుతూ ఉండకూడదు. ఉత్సాహంగా జీవితంలో ముందుకెళ్ళాలి. మనం నిజాయితీగా ఉండడమే ఒక జాగృతి. మనం స్వచ్ఛంగా, నిర్భయంగా ఉండాలి. ఆశావాదం అంటే భయం లేక పోవడం కాదు. నిర్భయంగా సమస్యలను ఎదుర్కొంటూ, వాటి మధ్య వుంటూనే పరిష్కారంపైన దృష్టి సారించాలి. ఈ సందర్భంలో మనం అంతర్ముఖులం కావాలి. మనస్సు ఆలోచనలకు కేంద్రం. ఇక్కడే మన జీవితానికి సారం, సార్థకత, స్వచ్ఛత నిబిడీకృతమై వుంటాయి. ఒక గొప్పకవి ఇలా అంటారు. "నేను రాసిన వేలాది పాటలు విఫల మయ్యాయి. నేను పాటల్లో ఇమడని భావాలను రాయాలని ప్రయత్నించాను. మాటలు భావాలకు ప్రతీకలు. ఇవి సూచికలు కూడా. కానీ ఈ సూచికలు మన భావాలను సూత్రప్రాయంగా కూడా సూచించవు." నేను వీరితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మాట అనేది ఒక భావాన్ని సూచించే సూచికేగానీ, అది సూచించే భావం ప్రస్ఫుటంగా వుండదు. అందుకని మీరు మాటలను ప్రేమించకండి. ఆ మాటలు సూచించే సారాన్ని గ్రహించండి. మౌనం ప్రబోధనాత్మకంగా వుంటుంది ఆశక్తి ఈ మాటల్లో ప్రవహిస్తుంది. ప్రేమ అనే మాట ప్రేమకాదు కానీ ప్రేమను సూచిస్తుంది కదా ! "గురువుగారు సంతోషంగా, సంభ్రమంగా కనిపిస్తున్నారు కదూ" అన్నాడు ఒక శిష్యుడు. "అలా ఉండటానికి మొదటి మెట్టు అహంభావాన్ని విడనాడటమే" అన్నాడు" మరొక శిష్యుడు.