VIJAYAPATHAGARJANA- ROAR YOUR WAY TO EXCELLENCE (TELUGU) by SWAMI SUKHABODHANANADA English book cover

VIJAYAPATHAGARJANA- ROAR YOUR WAY TO EXCELLENCE (TELUGU)

by SWAMI SUKHABODHANANADA

₹200
In stock · 4 available
PublisherPRASANNA TRUST
LanguageEnglish
'రిసోర్ఫుల్'గా ఉండటమే కళ మూర్ఖుడితో వాదించి గెలవటం అసాధ్యం. అలాగే మనదైన అజ్ఞానాన్ని గుర్తించి అంగీకరించగలగటం మరీ కష్టం. 'నేను తెలివైనవాడిని, జ్ఞానిని’ అనే ఒక ఊహాజనిత అహంకారం కలిగిన అజ్ఞానులతో ముఖాముఖి మాట్లాడటం కూడా కష్టం. ఈ ఊహాజనిత అహంకారం అసలు వాస్తవంపై ఒక భ్రమను ప్రసరింపచేస్తుంది. ఈ క్రమంలో భ్రమ వాస్తవంగా కనపడుతుంది. వాస్తవం భ్రమచేత కప్పబడుతుంది. ఇది రజ్జు సర్ప భ్రాంతి వంటిది. అంటే తాడుమీద సర్పభావం ఆరోపింప బడింది. తాడు మాయమై, పాము అనే భ్రాంతి సత్యంగా కనబడుతుంది. ఇక్కడ మనమే భ్రాంతిని మనపైన, ఇతరులపైన అధ్యారోపణ చేస్తాం. ఈ అధ్యారోపణ తొలగితేకాని, తనలోను, ఇతరులలోను ఉన్న ఆత్మ తత్త్వాన్ని గుర్తించి గ్రహించటం జరుగదు.