VIJETHA CHANDRABABU VYAKTITWA VISHLESHANA by DR.T.S.RAO Telugu book cover

VIJETHA CHANDRABABU VYAKTITWA VISHLESHANA

by DR.T.S.RAO

₹120
In stock · 3 available
PublisherJ.P PUBLICATIONS
LanguageTelugu
నా మాట గొప్పవారి జీవితచరిత్రలు మనలో స్ఫూర్తిని రగిలిస్తాయి. వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు, వాటిపట్ల వారు స్పందించిన తీరును ఆకళింపు చేసుకుంటే మన జీవితాలకు వాటిని అన్వయించుకుని మనకంటూ ఒక మార్గాన్ని ఏర్పరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే జీవితంలో ప్రతిఒక్కరికీ ఒక రోల్ మోడల్ ఉండాలి. అసాధారణ విజయాలను నమోదు చేసిన వ్యక్తుల జీవిత చరిత్రలను వారు స్వయంగాగానీ, ఇతరులుగానీ రాయడం సంప్రదాయంగా వస్తున్నదే. అయితే మహోన్నత వ్యక్తుల జీవితాన్ని మధించి, వారి వ్యక్తిత్వంలోని సుగుణాలను యువతరానికి స్ఫూర్తిదాయకంగా మలిచిన ప్రయత్నాలు మాత్రం తక్కువే అని చెప్పాలి. తెలుగుదేశంలో చంద్రబాబు చేరిక మొదలు నేటివరకూ ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఆసక్తితో గమనిస్తున్నవారిలో నేనూ ఒకణ్ణి. ఆ ఆసక్తితో పాటు ఆయన జీవితం ఆధారంగా వ్యక్తిత్వవికాస పాఠాలను చెప్పవచ్చనే ఉత్సాహంతోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని విశ్లేషించే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాను. ముఖ్యంగా యువతరానికి అంటే... రాజకీయ రంగంలో ప్రవేశించేవారు మాత్రమే కాదు... ఏ రంగంలో విజయాలు సాధించాలనుకునే వారికైనా మార్గనిర్దేశనం చేయగలిగే రీతిలో ఈ పుస్తకంలోని అంశాలు ఉండే విధంగా పలు జాగ్రత్తలు తీసుకున్నాను. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక లక్ష్యం వుండాలి. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం అవిశ్రాంతంగా పనిచేయాలి. జీవిత పరమావధిగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా మడమతిప్పని శౌర్యం ప్రదర్శించాలి.