
VIMUKTHI PRADATHA MOHAMMAD
by M.A.RAHMAN
₹160
In stock · 1 available
PublisherAI-Ameen Publications Foundation
LanguageTelugu
అల్లామా షిబ్లీ నోమానీ ఉర్దూలో రాసిన మహా ప్రవక్త(స) జీవిత చరిత్ర 'సీరతున్నబీ' అత్యంత ప్రామాణిక గ్రంథాల్లో ఒకటి. దాని ఆధారంగా ఎమ్.ఏ. రహ్మాన్ రాసిన విముక్తి ప్రదాత ముహమ్మద్(స) గ్రంథ ప్రతి మా ముందుకొచ్చింది. ఆరు సంపుటాల్లో ఉన్న ఉద్గ్రంధానికి బదులుగా అతి కొద్ది పేజీల్ని చూసి విస్తుబోయాము. వాటిని చదివి ఇంకా ఆశ్చర్యపోయాం. మహాప్రవక్త(స) జీవితంలోని అన్ని ముఖ్య ఘట్టాలు సవివరంగా పొందుపరిచారు రచయిత. అతి కొద్ది మాటల్లో ఇంత వివరణాత్మకంగా అందించగలిగిన ఆయన ప్రతిభను కొనియాడకుండా ఉండలేము. ఇంత చక్కటి గ్రంథాన్ని అల్ అమీన్ పబ్లికేషన్స్ ఫౌండేషన్ సంస్థ తొలి ప్రచురణగా మీ ముందుంచుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో అమూల్యమైన ఈ పుస్తకాన్ని ప్రచురించే సదవకాశాన్ని మా సంస్థకు కల్పించిన రహ్మాన్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ముస్తీ ముహమ్మద్ ఫారూఖ్ ఖాసిమీ