VINADANIKOMANISHI by SOMARLA RAMESH Telugu book cover

VINADANIKOMANISHI

by SOMARLA RAMESH

₹50
In stock · 6 available
PublisherSOMARLA RAMESH
LanguageTelugu
వినడానికో మనిషి తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి వెళ్ళబోయేది 'శ్రీనగర్' అని విని ఆశ్చర్యంగా చూశాడు వంశీ. "మరి మీరెక్కడికి ?" ఆ శ్రీనగర్ వ్యక్తి వంశీని ప్రశ్నించాడు. "నేను హైదరాబాద్' అని బదులిచ్చాడు వంశీ "ఈ ట్రైన్ హైదరాబాద్ వెళుతుందా!" రూట్లో హైదరాబాదున్న జ్ఞాపకం లేదు. సంశయంగా అడిగాడు. "వెళ్ళదు. ఖాజీపేటలో దిగి హైదరాబాద్ వెళతాను" వంశీ వివరించాడు. "మీ పేరేమిటి ? "వంశీ, మరి మీ పేరు ?! " వంశీ తిరిగి అడిగాడు "జావేద్” శ్రీనగర్ వెళ్ళే వ్యక్తి పేరు జావేద్ అని తెలియడంతో అతనో ముస్లిం అని అనుమానం లేకుండా అర్ధమయింది వంశీకి. జావేదిని చూస్తుంటే ముస్లిం అని తెలిసిపోతుంది కానీ పేరు విని అది నిజమని అర్ధమయింది. వాళ్ళిద్దరూ వున్న ట్రైన్ మంగళూరు నుండి జమ్ము వెళ్ళే నవయుగ ఎక్స్ప్రెస్లో. బండి బయలుదేరి గంటవుతోంది. బండి కర్ణాటక బోర్డర్ దాటి కేరళలోకి ప్రవేశించింది. మనసంతా ఎంతో బరువుగా, బాధగా వున్న వంశీ మనసుని మళ్ళించడం కోసం ఎదురుగా కూర్చున్న వ్యక్తిని పలుకరించాడు అలా పలుకరించినప్పుడే ఆయనది శ్రీనగరని తెలిసింది. "శ్రీనగర్ ఎందుకు వెళుతున్నారు!" వంశీ మళ్ళీ అడిగాడు. "మాది శ్రీనగరే. మా అమ్మాయి ఇక్కడ మణిపాల్లో మెడిసిన్ చదువుతోంది. మా అమ్మాయిని చూడడానికి వచ్చి వెళుతున్నాను. మరి మీరు మంగళూరులో ఏంచేస్తున్నారు?" వంశీ గురించి అడిగాడు జావేద్.