
VINTHA CHITKA
₹60
In stock · 733 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
వెండిపళ్ళెం మిగిలిపోయింది. అరువుగా ఎవరినయినా అడిగి తెచ్చి కొంతకాలం ఇంట్లో వుంచుతానని భార్య మాధవయ్యకు వెండిపళ్ళెంలో భోజనం చేయాలనే కోరిక చాలాకాలంపాటు తీరకుందా సుధమ్మ చెప్పినా ఇష్టపడలేదు. అయితే అనుకోకుండా - దివాణంలో పనిచేస్తున్న వారందరిలో మాధవయ్యను నిజాయితీ గల ఉద్యోగిగా గుర్తిసూ జమీందారు అతన్ని ఏదయినా కోరుకోమన్నాడు. అదే అవకాశంగా భావించి తన కోరికను వెలిబుచ్చగా మాధవయ్యకు వెండిపళ్ళెం చేయించి ఇచ్చాడు జమీందారు. తొలిసారిగా వెండిపళ్లెంలో భోజనం చేయబోతుండగా మాధవయ్య చుట్టం నీలాంబరుడు దిగబడ్డారు. అతనికి అరిటాకు వేసి భోజనానికి సిద్ధం చేసింది సుధమ్మ. అప్పుడు నీలాంబరుడి దృష్టి వెండిపళ్ళెంపై వడింది. దాన్ని చూసి ముచ్చట పడుతూ "నీ పళ్లెం నాకు చాలా నచ్చింది. ఇటువంటి పళ్లెం నేనూ చేయించుకుంటాను. నేను వెళ్లేటప్పుడు నాకు దీన్ని ఇస్తే మా స్వర్ణకారుడికి చూపించి మరల రెండురోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను" అన్నాడు. ఆ మాటలకు మాధవయ్య గుండెల్లో రాయిపడింది. అతని మాటను కొట్టిపారేసే ధైర్యంలేక పోయింది. చివరకి ఇవ్వక తప్పింది కాదు. రెండు రోజులని చెప్పి కంచం పట్టుకెళ్లిన నీలాంబరుడు నెలరోజులయినా దాన్ని వాపసు చేయకుండా ఏవో కుంటిసాకులు చెబుతూ కాలం వెళ్లబుచ్చాడు. మాధవయ్య కబురుచేయగా చేయగా, 'నీ కంచాన్ని నేనేమన్నా కొరుక్కుతినేస్తాననుకున్నావా ఏం' అని మొహం గంటు పెట్టుకు మరీ కంచాన్ని తిరిగి ఇచ్చాడు నీలాంబరుడు. ఆ రోజునుంచీ తన వెండి పళ్లెం విషయం ఇతరులెవరికీ తెలియకుండా జాగ్రత్త పడసాగాడు. మాధవయ్య,