
VINTHA GODUGU - 40
by KONA NAGA VENKATA ANJANEYULU
₹40
In stock · 619 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తెలివిగలవాడు హేలాపుర నివాసి వరహాలయ్య కుమారుడు మాధవుడు, ఎనిమిదేళ్ళవాడు. తల్లిదండ్రులకు కడగొట్టువాడు కావడంతో, 208 ^ 6 అల్లారుముద్దుగా పెరిగాడు. వాణ్ణి బంధువులందరూ మంచిచురుకైనవాడనీ, చాలా తెలివైనవాడనీ మెచ్చుకునేవారు. అయితే, ఇంతతెలివిగలవాడనిపేరు తెచ్చుకున్న మాధవుడు, ఒక్కవిషయంలో మాత్రం అతి తెలివితక్కువగా ప్రవర్తించేవాడు. అదేమంటే - ఒకసారి వరహాలయ్య దూరపు బంధువు, పొరుగూరునుంచి ఏదో పనిమీద ఆయన ఇంటికి వచ్చాడు. ఆ బంధువు ఒకవారం రోజులుండి, తిరిగి వెళ్ళిపోయేముందు, జేబులోంచి ఒక వెండి నాణెం, ఒక రాగినాణెంతీసి, మాధవుడికి చూపించి, “ఒరే, మాధవా! ఎందుకో నీ తెలివితేటల్ని పరీక్షించాలనిపిస్తున్నది!” అంటూ నవ్వి, మాధవుడి ముందు ఆ రెండునాణేలను వుంచి, " ఈ రెంటినీ నీకిస్తాననుకోకు. నువ్వు వీటిలో ఏదో ఒక్కదాన్నిమాత్రమే తీసుకోవాలి, తెలిసిందా!” అన్నాడు. మాధవుడు ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా, రాగినాణెం తీసుకున్నాడు. ఇదిచూసి వరహాలయ్యబంధువు తెల్లబోయాడు. 208 ^ 6 తెలివిగలవాడని అందరూ అనుకునే మాధవుడు వెండి నాణెం కాక రాగినాణెం ఎందుకు తీసుకున్నాడో, ఆయనకు అర్థం కాలేదు. ఆయన 6 ^ 6 * 6 ^ 6 వాడి తెలివితక్కువ తనానికి నవ్వుకుని, వెండినాణెం జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు. ఈ విషయం మర్నాటికల్లా, ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. అంతా తెలివిగలవాడని చెప్పుకునే మాధవుడు, ఏమంత తెలివిగలవాడు కాకపోగా, చాలాతెలివి తక్కువాడని కాకపోగా, చాలాతెలివి తక్కువవాడని వాళ్ళు నవ్వుకున్నారు. ఊళ్ళో వాణ్ణి పరీక్షించేందుకు ఎవరు వెండీ, రాగి నాణేలు యివ్వజూపినా వాడు రాగినాణెమే తీసుకునేవాడు. ఇలా కొంత కాలం జరిగింది. ఒక రోజునవరహాలయ్య ఇంటికి సోమయ్య అనే బంధువు వచ్చాడు. సోమయ్య, వరహాలయ్య భార్యకు వేలువిడిచిన పినతండ్రిగారికుమారుడు,