VIPANCHI by SAIMADHAV BURRA Telugu book cover

VIPANCHI

by SAIMADHAV BURRA

₹200
In stock · 123 available
PublisherKALALA KANACHI
LanguageTelugu
చిగురు మేఘం అదొక విశాలమైన ఆధునిక భవనం. అందులో ముగ్గురు డాక్టర్ల నివాసం తెరతొలగగానే విశాలమైన హాలు సోఫాలు, ఖరీదైన కుర్చీలు, ఒక టేబుల్ మీద లాప్టాప్ ఉంది. హాలు నుంచి లోపలికి వెళ్ళటానికి RF లో ఒక మార్గం LF ఒకమార్గం పనిచేసేవాళ్ళకి ఎడమ వైపునించి హాల్లోకి మార్గం .. నియాన్ లైట్ల వెలుగులో పేర్లు 1) Dr. K. ధనుంజయరావు, M.D. జనరల్ మెడిసిన్ 2) Dr. R. కళ్యాణ చక్రవర్తి, కార్డియాలజిస్ట్ M.D.D.M (P.G.I.MER) F.A.C.E-F.S.CAI 3) Dr. R. శోభన, న్యూరాలజిస్ట్ M.D.D.M (P.GI.MER) (ఒకస్పాట్లో అతిసామాన్యుడు) దేవుడా ఆలకించు నా ప్రార్ధన, నీవిచ్చిన ఈ దేహాన్ని రక్షించు వేలమైళ్ళనించి వలస వస్తున్న అంటు వ్యాధులనించి, ఆధునికత సంతరించుకొని విజృంభిస్తున్న సరికొత్త వైరన్లనుంచి బాక్టీరియానించి కలుషితమౌతున్న మానవ ఆలోచనలనించి రక్షించు నాదేహాన్ని." (మరొక స్పాట్లో) (డాక్టరు - ప్రతిజ్ఞ) " మెడికల్ కాలేజి నుండి గ్రాడ్యుయేట్సెమైన మేము ఈ నైతిక ప్రతిజ్ఞ చేస్తున్నాము.) 1) ఈ రోజు శిక్షణలో వైద్యుడిగా నాకు అందించిన అధికారాలు బాధ్యతలను గుర్తిస్తున్నాను. 2) నేనీ వృత్తిని - మనస్సుతో, మానవతతో సామాన్య రోగులపట్ల వారి హక్కులపట్ల గౌరవంతో వ్యవహరిస్తాను. 3) నేను ఈ సమాజంలో ఆరోగ్యప్రమాణాలను మెరుగుపరచడం వెనుకబడిన వారి సంరక్షణకు ప్రాప్యతను పెంచడం ఒక విద్యార్థిగా నాబాధ్యత. 4) నేనీ వాగ్దానాలను గంభీరంగా, స్వేచ్ఛగా నామీద గౌరవంతో చేస్తున్నాను. (స్పాట్ ఆగి - ఫుల్ట్స్ వెలిగాయి)