VIPANCHI - 230 by SAIMADHAV BURRA Telugu book cover

VIPANCHI - 230

by SAIMADHAV BURRA

₹230
In stock · 73 available
PublisherKALALA KANACHI
LanguageTelugu
నా మాట నాటకంలేని బతుకుండదు.. నటులుకాని మనుషులుండరు.. బతుకులో నటించటం మనిషికవసరం.. రంగస్థలంమీద నటిస్తూ ఆ బతుకుల్ని ప్రదర్శించటం ప్రపంచానికవసరం.. కళారూపం ఎవరి ఆత్మను వాళ్లకి చూపిస్తుంది, ప్రతి అంతరాత్మనూ ప్రశ్నిస్తుంది.. సమాధానాలు సాధిద్దాం రమ్మని పిలుస్తూనే వుంటుంది.. తలుపులు తెరిచి బయటికొచ్చేదాకా గుండెతలుపులు తడుతూనేవుంటుంది.. అందుకే.. ఏదేశం క్షేమానికైనా క్షామానికైనా ఆదేశంలో ఎంతమంది కళాకారులున్నారన్నదే కొలమానం. ఎన్ని కళాకారూపాలు వర్ధిల్లుతున్నాయన్నదే ప్రమాణం.. కళాకారులు కన్నీళ్లుపెట్టినా, కళారూపాలు Q తగ్గుముఖం పట్టినా ఆ దేశం బాగోలేదని అర్థం.. నాటకంకోసం, నటనకోసం ఎవరెవరివో కష్టాలూ, సంతోషాలూ మానసికంగా మోసే కళాకారులకు కన్నీళ్లెక్కువవుతున్నాయ్.. తుడిచే చేతులు తక్కువవుతున్నాయ్..