
VIPAREETA VYAKTULU
₹120
In stock · 5 available
PublisherP.CHANDRASEKHARA AZAD
LanguageTelugu
ఈ నవల నేపథ్యం ... ఓ రోజు మిత్రులు దాట్ల దేవదానం రాజుగారు ఫోన్ చేశారు. మల్లాడి కృష్ణారావుగారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి రాజకీయ జీవితంలో వుండి యానాం రూపురేఖలు మార్చిన నాయకుడు. వారి జీవిత కథను రాయాలి. మీరు అంగీకరిస్తే మీ పేరు వారికి చెబుతాను అన్నారు. “మీరు యానాం చరిత్రను రాశారు. కవులు, కథకులు, యానాం కథలు ప్రచు రించారు. మీరు రాయవచ్చు కదా” అన్నాను. 'నేను స్లో రైటర్న్న మీకు తెలుసు. ఇది అర్జెంటుగా పూర్తి చేయాలి' అంటూ మల్లాడి కృష్ణారావు గారి గురించి చెప్పారు. ఆయన పెద్దగా చదువుకోలేదు. కానీ జీవితం ఆయనకు నేర్పిన పాఠాలు, ఆయన నాయకుడిగా ఎదిగిన తీరు, మత్స్యకారుల జీవితాల్లో ఆయన తీసుకొచ్చిన పెనుమార్పులు నన్ను ఆకర్షించాయి. అందుకు ఒప్పుకున్నాను. ఇప్పుడు మల్లాడి పుదుచ్చేరి ప్రభుత్వంలో అయిదారు శాఖలకు మంత్రి. ఇరవై ఐదు సంవత్సరాలుగా ఓటమి ఎరుగని నాయకుడు. ఇది జరిగి అయిదు సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. అలా మొదలయింది యానాం ప్రయాణం. అయిదారు సార్లు వెళ్ళాను. ప్రతిరోజూ నేనూ, దాట్ల గారు కలవటం, మధ్యలో మల్లాడిగారిని వందలాది మధ్య కలిసి అయిదు నిమిషాలు మాట్లాడటం గొప్ప అనుభవం. ఆరోజు.. దాట్ల గారిని కలవటానికి వారి మిత్రుడు వచ్చాడు. రెండు గంటలు మాట్లాడు కుంటూనే వున్నారు. నేను సైలెంట్గా వింటున్నాను. తర్వాత అతని గురించి కొన్ని విషయాలు దాట్ల గారు చెప్పారు. అప్పుడే అన్నాను. నేను 'నవల' రాస్తాను అని. నవల పూర్తి అయింది. రెండు మూడు పత్రికలు నవలను అంగీకరించలేదు. అప్పుడు మిత్రులు బొప్పన విజయ్కుమార్ గారు 'రేపటికోసం' మాసపత్రికను నడుపుతున్నారు. వారికి, కలిమిశ్రీకి కూడా నా కథ 'సుశీల' అంటే ఎంతో ఇష్టం. కలిమిశ్రీ పత్రికలో అసోసియేట్ ఎడిటర్గా వున్నాడు. ఇద్దరూ ఈ నవల గురించి విన్నాక మనం తప్పకుండా ప్రచురిద్దాం అన్నారు. నాలుగయిదు నెలలు సీరియల్గా వచ్చాక పత్రిక ఆగిపోయింది.